Site icon NTV Telugu

JC Prabhakar Reddy: సింగనమల టీడీపీలో వర్గ విభేదాలపై సంచలన వ్యాఖ్యలు

Untitled Design (7)

Untitled Design (7)

అనంతరపురం జిల్లా సింగనమల టీడీపీలో వర్గ విభేదాలపై మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి పై గత కొద్దిరోజులుగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
అనంతపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బండారు శ్రావణి చదువుకున్న ఎమ్మెల్యే…ఆమెకి అన్ని తెలుసని ఆయన అన్నారు.బండారు శ్రావణి ఫోటో పక్కన పెట్టి డబ్బులు ఎంచుతున్నాడని వీడియో వైరల్ చేస్తున్నారు.సింగనమలలో ప్రతిపక్ష పార్టీ నాయకుల గురించి మాట్లాడే ధైర్యం మీకు లేదా..??? అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి కులం తక్కువని మీరు ఇలా ప్రవర్తిస్తున్నారా?? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ ఎమ్మెల్యే పై మీరు ఏం ప్రతాపం చూపిస్తారన్నారు.
బుక్కరాయసముద్రం, పుట్లూరులో ప్రతిపక్షం పార్టీ మీటింగ్ పెట్టి మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. మా తాడిపత్రి తెలుగుదేశం పార్టీలోనే 150 గ్రూపులు ఉన్నాయని..మీకు ఏదైనా సమస్య ఉంటే సింగనమల నియోజకవర్గం లో నర్సా నాయుడు, కేశవరెడ్డి వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించుకోండన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి..

Exit mobile version