Site icon NTV Telugu

Jaya Bachchan: జయా బచ్చన్‌ ఆస్తుల చిట్టా ఇదే! అవాక్కవాల్సిందే!

Jaya

Jaya

జయా బచ్చన్ (Jaya Bachchan) మరోసారి రాజ్యసభకు వెళ్తున్నారు. వరుసగా ఐదోసారి రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. సమాజ్‌ వాదీ పార్టీ తరపున ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు. ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన జయా బచ్చన్‌కు మరోసారి పెద్దల సభలో అడుగుపెట్టే అవకాశం దక్కింది.

ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలను వెల్లడించారు. జయ బచ్చన్, అమితాబ్ బచ్చన్‌ (Amitabh Bachchan)కు 17 కార్లు మరియు రూ. 130 కోట్లకు పైగా బ్యాంక్ బ్యాలెన్స్‌తో పాటు రూ.1,578 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు.

2022-2023వ సంవత్సరానికి గానూ జయ వ్యక్తిగత నికర విలువ రూ.1.63 కోట్లు కాగా, ఆమె భర్త అమితాబ్‌ నికర విలువ రూ.273.74 కోట్లుగా ఉంది. తన బ్యాంకులో రూ.10 కోట్లు ఉన్నాయన్న ఆమె అమితాబ్‌ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ రూ.120 కోట్లుగా పేర్కొన్నారు. ఉమ్మడి చరాస్తుల విలువ రూ.849 కోట్లు కాగా స్థిరాస్తి విలువ రూ.729 కోట్లుగా ఉంది.

ఆమె దగ్గర రూ.40.97 కోట్ల విలువైన నగలతో పాటు రూ.9.82 లక్షల విలువ చేసే కారు ఉంది. అమితాబ్‌ దగ్గర రూ.54.77 కోట్ల ఆభరణాలతో పాటు రూ.17.66 కోట్లు విలువ చేసే 16 వాహనాలున్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మొత్తంగా బిగ్‌బీతో కలిసి రూ.1578 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు జయా బచ్చన్‌ ప్రకటించారు.

ఎన్నికల అఫిడవిట్ ప్రకారం వారి ఉమ్మడి ఆస్తులలో వివిధ వనరుల ద్వారా సంపాదించిన ఆస్తులు ఉన్నాయి. జయ సంపదకు మూలాలు ఆమె ఎండార్స్‌మెంట్ల ద్వారా సంపాదించిన డబ్బు, ఎంపీగా ఆమె జీతం మరియు నటిగా ఆమె ఫీజు ఉన్నాయి. అమితాబ్ ఆదాయ వనరులు వడ్డీ, అద్దె, డివిడెండ్‌లు, మూలధన లాభాలు మరియు నటుడిగా అతని వృత్తిపరమైన రుసుముతో పాటు సోలార్ ప్లాంట్ ద్వారా వచ్చే ఆదాయంగా పేర్కొనబడ్డాయి.

Exit mobile version