Site icon NTV Telugu

Jason Gillespie: అందుకే పాక్ జట్టు కోచ్‌గా తప్పుకున్న: జేసన్ గిలెస్పీ

Jason Gillespie

Jason Gillespie

Jason Gillespie: 2024లో పాకిస్థాన్‌ కోచ్‌గా పనిచేసిన ఆస్ట్రేలియా మాజీ బౌలర్‌ జేసన్‌ గిలెస్పీ ఉన్నట్లుండి తన కోచ్ పదవి నుంచి వైదొలిగారు. ఆ టైంలో ఆయన పాక్ జట్టు కోచ్ పదవి నుంచి ఎందుకు తప్పుకున్నారో అనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అది కూడా ఆయన అధికారికంగా ఎందుకు తప్పుకున్నారు అనేది ఎక్కడ బయటపెట్టలేదు. తాజాగా ఆయనను ఎక్స్ వేదికగా ఒక యూజర్.. ఎందుకని పాకిస్థాన్ జట్టు కోచ్ పదవి నుంచి తప్పుకున్నారు అని ప్రశ్నించగా.. దానికి సోషల్ మీడియా వేదికగా సమాధానాన్ని వెల్లడించారు.

READ ALSO: AKKI : హిట్టిచ్చిన హీరోయిన్స్ ను రిపీట్ చేస్తున్న అక్షయ్ కుమార్.. కలిసొచ్చేనా?

ఈ సందర్భంగా ఆయన పాకిస్థాన్ జట్టు కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోడానికి గల కారణాలు వివరిస్తూ.. ‘నేను అప్పుడు పాకిస్థాన్‌ టెస్ట్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నా. అదే టైంలో చీఫ్ కోచ్ అయిన నాకు ఎలాంటి ఇన్‌ఫర్మెషన్ ఇవ్వకుండానే పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డ్‌ మా సీనియర్‌ అసిస్టెంట్‌ కోచ్‌ను తొలగించింది. నిజానికి అది ఏమాత్రం కరెక్ట్‌గా అనిపించలేదు. ఈ సంఘటనతో పాటు ఇలాంటి మరిన్ని అవమానకర పరిస్థితులు ఎదురయ్యాయి. అందుకే పాక్ జట్టు కోచ్‌గా తప్పుకున్న’ అని గిలెస్పీ వెల్లడించారు.

అలాగే కొంత కాలం క్రితం జేసన్‌ గిలెస్పీ ఒక సందర్భంలో పీసీబీ చీఫ్‌ నఖ్వీ గురించి మాట్లాడుతూ.. స్థానికంగా ఉండి కూడా కనెక్షన్‌ క్యాంప్‌నకు పీసీబీ చీఫ్‌ నఖ్వీ హాజరుకాలేదని గుర్తు చేశారు. గ్యారీ కిర్‌స్టన్‌ దక్షిణాఫ్రికా నుంచి, నేను ఆస్ట్రేలియా నుంచి విమానంలో పాకిస్థాన్‌కు వెళ్లాం. ‘కనెక్షన్‌ క్యాంప్‌ గురించి గొప్ప ఆలోచనలతో గ్యారీ కిరిస్టెన్‌ ముందుకు వచ్చాడు. ఈ క్యాంప్‌లో పాల్గొన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు తమ అనుభవాలను పంచుకున్నారు. నేను ఆస్ట్రేలియా నుంచి, గ్యారీ దక్షిణాఫ్రికా నుంచి విమానంలో వచ్చాం. కానీ పీసీబీ ఛైర్మన్‌ నఖ్వీ లాహోర్‌లోనే ఉండి కూడా క్యాంప్‌నకు హాజరు కాకుండా, జూమ్‌ ద్వారా మాతో మాట్లాడాడు. నిజానికి అది కొంచెం అసాధారణం’ అని జేసన్‌ గిలెస్పీ విమర్శించాడు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా నాటి పరిస్థితులను, తాను కోచ్ పదవి నుంచి వైదొలగడానికి కారణాలు వివరించారు.

READ ALSO: Lyricist Chandrabose : ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వస్తుందనుకోలేదు: చంద్రబోస్

Exit mobile version