NTV Telugu Site icon

Japan : జపాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Whatsapp Image 2023 12 04 At 11.36.26 Am

Whatsapp Image 2023 12 04 At 11.36.26 Am

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జపాన్..క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ గా రూపొందిన ఈ సినిమా కు రాజు మురుగన్ దర్శకత్వం వహించాడు.జపాన్ సినిమాలో కార్తికి జోడీ గా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించింది. కార్తి సినిమా కెరీర్‌ లో 25 వ సినిమా గా తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 10 న థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజైంది.టీజర్‌ మరియు ట్రైలర్స్‌తో అభిమానుల్లో అంచనాల్ని రేకెత్తించిన ఈ మూవీ కలెక్షన్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అంతా భావించారు.కానీ కథ లో కొత్తదనం లేకపోవడం అలాగే కార్తి కామెడీ అనుకున్న స్థాయి లో పండకపోవడం తో జపాన్‌ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

ఇదిలా ఉంటే జపాన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధం అయింది.ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను సోమవారం అఫీషియల్‌ గా అనౌన్స్‌చేశారు. డిసెంబర్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.ఈ మూవీ తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో జపాన్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది..జపాన్ సినిమా లో టాలీవుడ్ కమెడియన్ సునీల్ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించాడు. ఓ నగల షాపు లో రెండు వందల కోట్ల విలువైన బంగారు నగలు దొంగతనానికి గురవుతాయి.ఆ దొంగతనం చేసింది జపాన్ (కార్తి) అని పోలీసులు అనుమానిస్తారు. సాక్ష్యాల తో అతడిని పట్టుకోవాలని ఎంతో ప్రయత్నిస్తుంటారు. అసలు ఆ దొంగతనం జపాన్ చేశాడా..అతడు ఈ కేసు లో ఎలా ఇరుక్కున్నాడు. జపాన్‌ కు సినిమా హీరోయిన్ సంజు(అను ఇమ్మాన్యుయేల్‌) తో ఉన్న సంబంధం ఏమిటన్నదే అనేది సినిమా కథ.. మరి థియేటర్స్ లో మెప్పించలేకపోయిన జపాన్.ఓటీటీ ప్రేక్షకులనైనా మెప్పిస్తుందో లేదో చూడాలి..