బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది.. ఒకవైపు బాలీవుడ్, టాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ సమ్మర్ లో చెమటలు పుట్టిస్తుంది.. ఎప్పుడూ హాట్ లుక్ లో కనిపించే ఈ అమ్మడు తాజాగా శారీలో మెరిసింది.. చీరలో అందమైన ఫోటోలను దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి..
జాన్వీ తన టాలెంట్ తో మొదటి సినిమాతోనే సూపర్ హాట్ హిట్ టాక్ ను అందుకుంది.. ఈ మధ్య తెలుగులోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేసింది.. మొదటి సినిమాతోనే ఎన్టీఆర్ తో ఛాన్స్ కొట్టేసింది.. ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తుంది. ఆ సినిమాలో అమ్మడు ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తున్నారు.. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ సినిమాకు ప్లస్ అవుతున్నాయి.. త్వరలోనే సాంగ్ రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం..
అంతేకాదు రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే.. ఈ సినిమా గురించి ఎప్పుడో ప్రకటించారు.. అలాగే ప్రభాస్ సినిమాలో కూడా ఛాన్స్ అందుకున్నట్లు ఓ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇందులో నిజమేంతుందో తెలియాల్సి ఉంది.. ఒకవైపు సినిమాలు మరోవైపు యాడ్స్ తో బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది..చాలా రోజులుగా గ్లామర్ ట్రీట్‌తో దుమారం రేపుతుంది. ఆమె సోషల్ మీడియాలో అందాల విస్పోటనంతో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. చీరలో అందాల విందు చేసింది.. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..