NTV Telugu Site icon

Pawan Kalyan: నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి సతీసమేతంగా హాజరైన సంగతి తెలిసిందే. ఆయన ఆదివారం బిజీబిజీగా గడిపారు. ఇవాళ ప్రత్యేక విమానంలో ఎంపీ సీఎం రమేష్‌తో కలిసి విశాఖకు విచ్చేశారు. అక్కడి నుంచి అనకాపల్లి గవరపాలెం నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల ముందు అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభలో గెలిచిన వెంటనే నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే ప్రమాణ స్వీకారం చేస్తానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇవాళ అమ్మవారిని దర్శించుకుని పవన్‌ కల్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read Also: Election Commission: 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు, జూలై 10న ఓటింగ్

అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పవన్ పిఠాపురం బయలుదేరారు. పిఠాపురంలో పార్టీ నేతలతో కీలక సమావేశంలో పాల్గొన్నారు. టీడీపీ – జనసేన నేతల మధ్య నెలకొన్న అసంతృప్తుల నేపథ్యంలో పవన్ వారితో సమావేశం కానున్నట్లు సమాచారం. ఇరు పార్టీ నేతలతో జనసేనాని మాట్లాడనున్నారు. ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్ మంత్రి పదవిని తీసుకుంటారా? ఒకవేళ తీసుకుంటే ఏ శాఖను ఎంచుకుంటారు? అనేది అత్యంత చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రివర్గంపై కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌ కల్యాణ్‌తో పాటు బీజేపీ నేతలతోనూ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్‌కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు మరో కీలక మంత్రి పదవి అప్పజెప్పే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఆయన సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడంతో ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్దికి కృషిచేసేందుకు సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్లు కూడా ఓ వర్గం నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.