Site icon NTV Telugu

Rajasthan : పంటి నొప్పని డాక్టర్ దగ్గరకు పోతే మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు

New Project (38)

New Project (38)

Rajasthan : రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో సమాజం సిగ్గుపడేలా ఓ ఉదంతం వెలుగు చూసింది. వైద్యుడు భగవంతుని స్వరూపం అంటారు. కానీ ఒక దంత వైద్యుడు చికిత్స పేరుతో క్రూరత్వానికి అన్ని హద్దులు దాటాడు. వైద్యం కోసం వచ్చిన మహిళకు సెమీ కాన్షియస్ ఇంజక్షన్ ఇచ్చి అసభ్యకరంగా ఫోటోలు, వీడియోలు తీశాడు ఓ ప్రైవేట్ క్లినిక్ డెంటల్ డాక్టర్ డాక్టర్ సురేశ్ సుందేషా. దీని తరువాత డాక్టర్ ఆ మహిళపై బ్లాక్ మెయిల్ చేస్తూ పదే పదే అత్యాచారం చేస్తూనే ఉన్నాడు.

ఈ కేసు జలోర్ జిల్లా భిన్మల్ నగరానికి సంబంధించినది. నిందితుడు డాక్టర్ సురేష్ సుందేషా నగరంలో ఓ ప్రైవేట్ డెంటిస్ట్ క్లినిక్ నడుపుతున్నాడు. బాధిత మహిళ డాక్టర్ సురేష్ సుందేషాపై భీన్మల్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. బాధిత మహిళ ఇచ్చిన నివేదికలో.. వైద్యం కోసం ఓ ప్రైవేట్ డెంటిస్ట్ క్లినిక్‌కి వెళ్లినట్లు పేర్కొంది. ఈ సమయంలో ఆమెకు నొప్పి తగ్గించే ఇంజెక్షన్లు ఇస్తూ వైద్యం చేయించే నెపంతో డాక్టర్ అసభ్యకర పనులు చేసి ఆమెతో అసభ్యకర వీడియోలు, ఫొటోలు చిత్రీకరించాడు.

Read Also:March 1st New Rules: మార్చి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్..

దీని తర్వాత డాక్టర్ ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. తీసిన వీడియో, ఫోటోలు వైరల్ చేస్తానని బెదిరించి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు. డాక్టర్ మహిళకు పదే పదే కాల్ చేసి మెసేజ్ చేసేవాడని, అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలు వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడని బాధిత మహిళ ఆరోపించింది. తన భర్త ఇంట్లో ఉన్నాడా లేదా అని ఫోన్‌ చేసిన కనుక్కొని నిందితుడు తనపై అత్యాచారం చేసేవాడని బాధిత మహిళ పోలీసులకు తెలిపింది. అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలను తొలగించాలని బాధిత మహిళ నిందితుడిని చాలాసార్లు కోరింది. అయినా అతడు బెదిరిస్తూనే ఉన్నాడు. డాక్టర్ మహిళపై ఇప్పటికే ఆరేడు సార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పేర్కొంది.

డాక్టర్ ఆసుపత్రిలో చెకప్ చేయించుకుంటానని తన కుటుంబ సభ్యులకు చెప్పి.. ఒంటరిగా క్లినిక్ లో ఎవరూ లేని సమయంలో రమ్మని కోరేవాడు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు అత్యాచారంతోపాటు ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో వైద్యుడిపై కూడా పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీస్ స్టేషన్‌లో ప్రైవేట్ క్లినిక్ వైద్యుడిపై బాధిత మహిళ అత్యాచారం కేసు పెట్టిందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హిమ్మత్ చరణ్ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలపై కేసు నమోదు చేసి డాక్టర్‌ను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. మహిళ ఇచ్చిన నివేదికపై విచారణ కొనసాగుతోంది.

Read Also:Hansika Motwani: క్యూట్ చూపులతో కలవరపరుస్తున్న హన్సిక మోత్వానీ…

Exit mobile version