NTV Telugu Site icon

Jalagam Venkata Rao: ఇండిపెండెంట్‌గా బరిలోకి మాజీ సీఎం కుమారుడు.. రేపు జలగం నామినేషన్‌

Jalagam Venkata Rao

Jalagam Venkata Rao

Jalagam Venkata Rao: మరోసారి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధం అయ్యారు జలగం వెంకటరావు.. ఈ సారి ఇండిపెండెంట్‌గానే తన అదృష్ట్యాన్ని పరీక్షించుకోనున్నారు.. రేపు నామినేషన్‌ దాఖలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న జలగం వెంకటరావు.. ఆ దిశగా ఏర్పాట్లలో మునిగిపోయారు.. మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి జలగం వెంగళరావు చిన్న కుమారుడే ఈ జలగం వెంకటరావు.. రేపు నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్న ఆయన.. ఇప్పటికే హైదరాబాద్ నుంచి కొత్తగూడెం బయల్దేరినట్టు తెలుస్తోంది..

Read Also: World cup 2023: ఆకాశమే హద్దుగా చెలరేగిన లంక బ్యాట్స్మెన్ .. వరల్డ్ కప్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ

కాగా, ఈ మధ్య కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలో అత్యంత సమీప అభ్యర్థి జలగం వెంకటరావును కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటించి సంచలన తీర్పు ఇచ్చింది.. అయితే, వనమా విజయంపై జలగం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వనమా తప్పుడు అఫిడవిట్ సమర్పించి ఆస్తులను సక్రమంగా ప్రకటించలేదన్న ఆరోపణలున్నాయి. ఇవి నిజమని గుర్తించిన కోర్టు అతడిపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు రూ. 5 లక్షల జరిమానా కూడా విధించిన విషయం విదితమే.. 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావుపై 4,120 ఓట్ల తేడాతో గెలుపొందారు ఆయన… జలగం వెంకటరావు ఆంధ్ర ప్రదేశ్ ఐదవ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు. ఆయన సోదరుడు జలగం ప్రసాదరావు కూడా మాజీ మంత్రి. వెంకటరావు 2004లో తొలిసారిగా ఖమ్మం సత్తుపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసి కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో టీఆర్‌ఎస్‌ తరఫున ఖమ్మం (ఉమ్మడి) నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే. కానీ, ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు మారడంతో.. ఆయన బీఆర్ఎస్‌ నుంచి టికెట్‌ దక్కలేదు. దీంతో.. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధం అయ్యారు.

Show comments