NTV Telugu Site icon

Jagga Reddy: అదే జరిగితే అతడిని సన్మానిస్తాం.. కిషన్ రెడ్డిపై జగ్గారెడ్డి ప్రశంసల జల్లు

Jaggareddy

Jaggareddy

బీఆర్ఎస్ కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పినందుకు కిషన్ రెడ్డి మాటలు స్వాగతిస్తున్నామని.. అదే జరిగితే సన్మానిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గా రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ ఐనట్టున్నారు. ఐదేళ్లు సీఎం రేవంత్.. కాంగ్రెస్ ప్రభుత్వం సేఫ్. ప్రభుత్వాలను పడగొట్టే దాంట్లో బీజేపీ నేతలు ప్రొఫెసర్లు. తెలంగాణ లో బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా పడగొట్టే అవకాశం లేదు. బీజేపీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రాదని తేలిపోయింది. అందుకే రోజుకో భాషా.. రోజుకో వేషం మారుస్తున్నారు. కిషన్ రెడ్డి చాలా గొప్పవారు. అటల్ బీహార్ వాజ్ పాయ్ దారిలో నడుస్తున్నట్టు కనిపించింది. మంచి పని చేస్తే.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రశంసించే గుణం వాజ్ పాయ్ ది. నిండు పార్లమెంట్ లో ఇందిరాగాంధీని దుర్గ మాతతో పోల్చారు. 25 మంది brs mla లు కాంగ్రెస్ లో చేరుతున్నారు అంటే.. ఐదు నెలల కాంగ్రెస్ పాలన బాగుందని అర్థం. కాంగ్రెస్.. రాష్ట్రంలో మంచి పాలన ఉందని ప్రశంస మాకు మంచిదే.” అని ఆయన పేర్కొన్నారు.

READ MORE: TS Polycet Counselling: పాలిటెక్నిక్ చేరే విద్యార్థులకి అలెర్ట్.. కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల..

బీజేపీ లో ఉన్న ఐదుగురిలో కూడా కొందరు బయటకు వస్తారని జగ్గారెడ్డి ఆరోపించారు. డైరెక్ట్ గా brs mla లు… ఇండైరెక్టు గా బీజేపీ mlaలు వస్తున్నట్టు కిషన్ రెడ్డి చెప్పారన్నారు. ” కిషన్ రెడ్డి వ్యాఖ్యలు మాకు సంతోషాన్ని ఇచ్చాయి. వరి గురించి ఆయనకు అవగాహన లేదు. అవగాహన పెంచుకుని మాట్లాడితే బాగుంటుంది అని సలహా. మద్దతు ధర ఫిక్స్ చేసేదే కేంద్రం. కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడి రైతులను కన్ఫ్యూజ్ చేయొద్దు. రంజాన్ రోజు ముస్లిం లు మా ఇంటికి బిర్యానీ పంపించే వాళ్ళు అని మోడీ చెప్పారు. ప్రభుత్వం రాదని భయం పట్టుకుని మాట్లాడుతున్నారు. వేషం మారింది.. బాషా మారింది. వంగి వంగి దండాలు పెడుతున్నారు మోడీ. కేటీఆర్ ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నరు. కేటీఆర్ మాట్లాడినా.. హరీష్ మాట్లాడినా రేవంత్ మీద బురద జల్లడమే. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా దందా చేశారా..? మీరు చేశారు కాబట్టి.. మేము కూడా చేస్తాం అనుకుని మాట్లాడుతున్నాడు కేటీఆర్. తెలంగాణ లో హత్యా రాజకీయాలు లేవు.. ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించదు. కేటీఆర్.. జూపల్లి మీద అబండాలు వేస్తున్నారు. రాజకీయ విలువల గురించి కేటీఆర్ మాట్లాడుతున్నతే