NTV Telugu Site icon

Jagapathi Babu : సినిమాల్లోకి రాకపోతే జగపతి బాబు ఏం చేసేవాడో తెలుసా?

Jagapathi

Jagapathi

ఒకప్పుడు హీరోగా వరుస సినిమాల్లో నటించి, ఇప్పుడు విలన్ గా మెప్పిస్తున్న స్టార్ హీరో జగపతి బాబు అలియాస్ జగ్గూ భాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సినిమాల్లో నటించాడు.. ఇప్పుడు స్టార్ హీరోలకు గట్టి పోటీని ఇస్తూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈయన ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను గురించి సినిమాల గురించి షేర్ చేస్తారు.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు.. అదికాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

జగపతి బాబు బాలయ్య బాబు నటించిన సూపర్ హిట్ మూవీ లెజెండ్ సినిమాతో విలన్ గా పరిచయం అయ్యాడు.. ఆ తర్వాత శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, మహర్షి, అఖండ, సలార్‌ వంటి హిట్ సినిమాల్లో విలన్ గా చేశాడు.. ఇప్పుడు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.. హాలివుడ్ లో కూడా నటించడానికి రెడీ అవుతున్నట్లు ఆ మధ్య సోషల్ మీడియాలో ద్వారా తెలిపాడు..

ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు.. ఆ పోస్ట్ నెట్టింట చర్చనీయంశంగా మారింది.. ఆ పోస్టులో తాను సినిమాల్లోకి రాకుండా ఉంటే ఖచ్చితంగా సూపర్ పోలీస్ అయ్యేవాడిని అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.. సూపర్ పోలీసుల్లాగే లా అండ్ ఆర్డర్‌ను గడగడలాడించేవాడిని.. ఏం అంటారు? అంటూ పోలీసు డ్రెస్‌లో ఉన్న ఫోటోను పంచుకున్నారు.. ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.. ఇక ప్రస్తుతం ఈయన అల్లు అర్జున్ పుష్ప 2 లో నటిస్తున్నారు..