తన సాయం కోరే వారికి తనవంతు సాయం చేయడం ఏపీ సీఎం జగన్ కి తెలిసినంతగా ఎవరికీ తెలియదని మరోమారు నిరూపించారు. తన స్వంత జిల్లా కడపలో ఆయన రెండవ రోజు పర్యటించారు. వైయస్‌ఆర్ జిల్లాలో రెండో రోజు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. అనంతరం పులివెందుల కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించారు. అలాగే నూతనంగా నిర్మించిన డాక్టర్ వైయస్‌ఆర్ బస్ స్టాండ్‌ను ప్రారంభించారు. రాజంపేట నుంచి వచ్చిన దేవర అనంతగిరి అనే యువకుడు జగన్ ని కలవాలని ప్రయత్నించాడు.
Read Also:Christamas: క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బాలయ్య
యాక్సిడెంట్ వల్ల నరాలు వీక్ నెస్ వల్ల ఏం పనీ చేయలేకపోతున్నానని, సాయం కావాలని కోరాను. చెన్నై, వేలూరు, తిరుపతి, బెంగళూరు ఆస్పత్రులకు తిరిగాను. జగన్ గారిని కలవాలని వచ్చానన్నారు. కలెక్టర్ కి విన్నవించాను. జాయింట్ కలెక్టర్ తనను కలవాలని కోరారు. ఆయన్ని కలిసి నా ఇబ్బందిని వివరిస్తా. తనకు సాయం చేస్తానని మాటిచ్చారన్నారు. జగన్ మాటిస్తే నెరవేరుస్తారని, ఆయన్ని కలవడం తనకెంతో సంతోషంగా ఉందన్నాడు.
శుక్రవారం కూడా జగన్ ఒకరికి సాయం అందించారు. కడప పర్యటనలో సీఎంని కలిసి తమ కుమారుడి అనారోగ్య సమస్యను వివరించాడు భూమాయపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు. వెంటనే స్పందించిన సీఎం, ప్రభుత్వం తరపున సహాయం చేస్తానని హామీ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వెంటనే రూ. 1 లక్ష ఆర్ధిక సాయం అందించనున్నారు జిల్లా కలెక్టర్ విజయరామరాజు.
భూమాయపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు, తను కడపలో రోజూ కూలీపనికి వెళుతూ జీవనం సాగిస్తున్నానని తెలిపాడు. అయితే, తన కుమారుడు నరసింహ (12 సంవత్సరాలు) నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తమ ఇబ్బందిని ముఖ్యమంత్రికి చెప్పుకున్నారు. వెంటనే స్పందించిన సీఎం నరసింహ కుటుంబానికి వెంటనే రూ. 1 లక్ష ఆర్ధిక సాయం చేయాలని, అంతేకాక ఆ బాలుడి వ్యాధికి మెరుగైన చికిత్సకు ఎంత ఖర్చు అయినా, ఎక్కడైనా సరే చేయించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఇలా తానెంత బిజీగా వున్నా.. తన సాయం కోరి వచ్చేవారిని ఆదుకుంటూ తన మానవత్వాన్ని జగన్ చాటుకుంటున్నారని బాధితులు, వైసీపీ నేతలు ప్రశంసిస్తున్నారు.
Read Also: Okkadu: ట్రైలర్ కట్ అదిరింది… ఘట్టమనేని అభిమానులకి జాతరే