NTV Telugu Site icon

Abdul Razzaq: ఆసియా కప్ దుబాయ్‌లో నిర్వహిస్తే మంచిదే: పాక్ మాజీ క్రికెటర్

A

A

ఆసియా కప్-2023 నిర్వహణపై వాడివేడి చర్చ నడుస్తోంది. వాస్తవానికి ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ పాక్‌లో నిర్వహిస్తే తాము వెళ్లేది లేదని బీసీసీఐ చెబుతోంది. టోర్నీని తటస్థ వేదికకు తరలించాల్సిందేనని పట్టుబడుతోంది. అయితే పాక్‌కు టీమిండియా రాకపోతే.. భారత్‌లో జరగబోయే వరల్డ్‌కప్‌ను బహిష్కరిస్తామని పీసీబీ హెచ్చరిస్తూ వస్తోంది. బోర్డుల తీరు ఇలా ఉంటే దీనిపై మాజీ క్రికెటర్లూ విభిన్నంగా స్పందిస్తున్నారు. తాజాగా పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ ఈ విషయంపై మాట్లాడాడు. ఆసియా కప్‌ను తరలించడం వల్ల క్రికెట్‌కు మంచే జరుగుతుందని అభిప్రాయపడ్డాడు.

Also Read: Suriya: సూర్య- జ్యోతిక కూతురిని చూశారా.. హీరోయిన్ లా ఉందే

“ఆసియా కప్‌ను పాక్ నుంచి దుబాయ్‌కి తరలించడం మంచిదే. దీంతో క్రికెట్ ప్రమోషన్ కూడా అవుతంది. ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌లను కేవలం ఐసీసీ టోర్నీల్లోనే చూస్తున్నాం. ఒకవేళ ఆసియా కప్‌ను దుబాయ్‌కి షిఫ్ట్ చేస్తే అది మంచి ఆప్షనే. అది క్రికెట్‌తో పాటు క్రికెటర్లకూ మంచిదే కదా. వాస్తవానికి ఇలా జరుగకూడదు. కానీ ఏం చేస్తాం. గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు సరిగా లేకపోవడంతో ఇలా జరుగుతోంది. అయితే దీనిపై ఇరు దేశాల క్రికెట్ బోర్డులు కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలి. అలా అయితే అది రెండు దేశాల క్రికెట్‌కు చాలా మంచిది” అని రజాక్ చెప్పాడు.

Also Read: Virat Kohli: సీల్ తీయని మొబైల్ పోయిందని కోహ్లీ ట్వీట్..జొమాటో రిప్లై అదుర్స్

కాగా, ఆసియా కప్ కోసం భారత్.. పాక్‌కు రాకపోవడం గురించి పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. “పాకిస్తాన్‌లో క్రికెట్ ఆడడానికి రాకపోతే ఇండియన్ క్రికెట్ టీమ్ నరకానికి వెళ్తుంది. పాక్ టీమ్‌ బతకడానికి టీమిండియా అవసరం లేదు. అయినా పాక్‌కు వస్తే ఎక్కడ ఓడిపోతామోనని వాళ్లు భయపడుతున్నారు. అందుకే ఫ్యాన్స్‌కు ముఖం చూపించలేమని భయపడి ఇక్కడికి రావడం లేదు” అంటూ వ్యాఖ్యానించాడు మియాందాద్.