Site icon NTV Telugu

DGP Ravigupta : లోక్‌ సభ ఎన్నికల్లో రూ.200 కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం

Dgp Ravi Gupta

Dgp Ravi Gupta

లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం మార్చి 1 నుంచి జూన్‌ 3వ తేదీ మధ్య రాష్ట్ర పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.200 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం, ఉచిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ పోలీసులు 466 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను (ఎఫ్‌ఎస్‌) ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) రవి గుప్తా సోమవారం విడుదల చేసిన నోట్‌లో తెలిపారు.

 

డబ్బు, విలువైన లోహాలు, మద్యం , ఉచిత వస్తువుల అక్రమ రవాణాను అరికట్టడానికి స్థానిక పోలీసుల మొబైల్ పార్టీలతో పాటు 85 రాష్ట్ర అంతర్గత సరిహద్దు చెక్ పోస్ట్‌లు. తనిఖీల్లో రూ.99.16 కోట్ల నగదు, రూ.11.48 కోట్ల విలువైన మద్యం, రూ.63.19 విలువైన లోహాలు, రూ.14.52 కోట్ల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 7,272 లైసెన్స్ ఆయుధాలను పోలీసుల వద్ద డిపాజిట్ చేశామని, 20 లైసెన్స్ లేని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని డీజీపీ తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 46.3 కోట్ల రూపాయల విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Exit mobile version