Site icon NTV Telugu

Israel-Khamenei: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. ఖమేనీకి ఇష్టమైన వాటిపై ఎటాక్

Israelkhamenei1

Israelkhamenei1

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు తీవ్ర అవుతున్నాయి. తాజాగా దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఉపయోగించిన విమానాన్ని ధ్వంసం చేసినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. సోమవారం రాత్రి టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని ధ్వంసం చేసినట్లుగా వెల్లడించింది. ఈ విమానాన్ని సీనియర్ ఇరాన్ అధికారులు, సైనిక ప్రముఖులు దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణించడానికి.. అలాగే మిత్రదేశాలతో సమన్వయం చేసుకోవడానికి ఉపయోగించే వారిని పేర్కొంది.

మెహ్రాబాద్ ఎయిర్‌పోర్టు టెహ్రాన్‌లోని పురాతన విమానాశ్రయాల్లో ఒకటి. ప్రస్తుతం దేశీయ, ప్రాంతీయ విమానాలకు సేవలు అందిస్తోంది. అత్యంత రద్దీగా ఉండే డొమిస్టిక్ విమానాశ్రయంగా పేరు గాంచింది. అంతేకాకుండా వైమానిక దళ ఆస్తులకు నివాసంగా కూడా ఉంటుంది.

ఫిబ్రవరి 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హతమయ్యాడు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. దీంతో పెద్ద ఎత్తున గల్ఫ్ దేశాలు దెబ్బతిన్నాయి. ఇక హార్ముజ్ జలసంధి మూసేయడంతో ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్, చమురు కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా జరుగుతోంది. ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో తెలియని సందిగ్ధం నెలకొంది.

Exit mobile version