Site icon NTV Telugu

Iran – Israel War : లైవ్ లో యాంకర్ న్యూస్ చదువుతుండగా ఇజ్రాయెల్ దాడి..

Iran

Iran

Iran – Israel War : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరుకుంది. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. నిన్న ఇజ్రాయెల్ మీద క్షిపణుల దాడులు చేసింది ఇరాన్. దానికి ప్రతిదాడిగా ఇజ్రాయెల్ రెచ్చిపోయింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. తాజాగా ప్రభుత్వ మీడియా సంస్థను టార్గెట్‌ చేసింది. యాంకర్‌ న్యూస్‌ చదువుతుండగానే స్టూడియోపై క్షిపణితో దాడి చేసింది. ఆ విజువల్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read Also : Sobhita : ఎవరేం అనుకున్నా పట్టించుకోను.. సీక్రెట్ చెప్పిన శోభిత

ఇరాన్ టీవీ స్టూడియోలో యాంకర్ న్యూస్ చదువుతుండగానే ఇరాన్ క్షిపణి దాడి చేసింది. న్యూస్ చదువుతున్న యాంకర్ సహర్ ఇమామీ దాడికి భయపడి లైవ్ లో నుంచి పరుగులు తీశారు. ఇజ్రాయెల్ దాడికి స్టూడియో బిల్డింగ్ మొత్తం షేక్ అయిపోయింది. ఇరాన్ లో తమ ఆర్మీ పైచేయి సాధించిందని ఇజ్రాయెల్ ప్రకటించుకుంది.

అప్పటి నుంచే ఇరు దేశాల నడుమ వైరం ముదిరింది. ఒకదేశంపై ఇంకొకటి క్షిపణుల దాడులు చేసుకుంటున్నాయి. దీంతో ప్రపంచమంతా అశాంతి వాతావరణం రేకెత్తేలా కనిపిస్తోంది. చరిత్రలో జరిగిన యుద్ధాల్లో ఈ రెండు దేశాలు కీలకంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు దేశాల నడుమ భీకర వాతావరణం కనిపిస్తోంది. ఎప్పుడు ఎటు నుంచి దాడి జరుగుతుందో అని రెండు దేశాల ప్రజలు వణికిపోతున్నారు.

Read Also : Vijay Devarakonda : నా ప్రతి అవార్డు వాళ్లకే సొంతం.. విజయ్ ఎమోషనల్ పోస్ట్..

Exit mobile version