Site icon NTV Telugu

Pushpa 2 : సినిమాలో అనసూయ పాత్ర మరింత వైల్డ్ గా ఉండబోతుందా..?

Whatsapp Image 2024 05 18 At 11.54.28 Am

Whatsapp Image 2024 05 18 At 11.54.28 Am

Pushpa 2 : టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయ జబర్దస్త్ షో తో ఎంతో పాపులర్ అయింది. తెలుగులో క్షణం మూవీలో అద్భుతంగా నటించి మెప్పించిన అనసూయ. ఆ సినిమా తరువాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అద్భుతంగా నటించి మెప్పించింది. ఈ సినిమాలో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా తరువాత అనసూయకు వరుస సినిమా ఆఫర్స్ వచ్చాయి.

వరుస సినిమాలలో నటిస్తూ అనసూయ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. జబర్దస్త్ షో కూడా వదిలేసి అనసూయ పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యారు. ప్రస్తుతం అనసూయ సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. గతంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన పుష్ప సినిమాకు పుష్ప 2 సీక్వెల్ గా తెరకెక్కింది.పుష్ప సినిమాలో అనసూయ ద్రాక్షాయిణి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది.ఈ సినిమాలో అనసూయ సునీల్ కు భార్యగా నటించింది.పార్ట్ వన్ లో అనసూయ పాత్ర కొంత సేపే వున్నా కూడా పుష్ప పార్ట్ 2 లో మాత్రం ఆమె పాత్ర నిడివి కాస్త ఎక్కువగా వుండనుందని సమాచారం .అంతేకాదు ఈ సినిమాలో అనసూయ పాత్ర మరింత వైల్డ్ గా ఉండనున్నట్లు తెలుస్తుంది.

Exit mobile version