2025 ఇరానీ కప్‌ను విదర్భ గెలుచుకుంది. రెస్ట్ ఆఫ్ ఇండియాను 93 పరుగుల తేడాతో ఓడించిన విదర్భ మూడో ఇరానీ కప్‌ను కైవసం చేసుకుంది. 361 పరుగుల లక్ష్య ఛేదనలో రెస్టాఫ్ ఇండియా 267 పరుగులకు ఆలౌటైంది. యశ్ ధుల్ (92), మానవ్ సుతార్ (56) హాఫ్ సెంచరీలు చేశారు. విదర్భ బౌలర్ హర్ష్ దూబె ఐదు వికెట్స్ (5/73)తో చెలరేగాడు. 2018, 2019లోనూ విదర్భ ఇరానీ కప్ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ చివరి రోజు ఇద్దరు భారత ప్లేయర్స్ ఘర్షణకు దిగారు.
మైదానంలో యష్ ధుల్, యష్ ఠాకూర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అంపైర్లు, ఆటగాళ్లు జోక్యం చేసుకోకపోతే ఇద్దరు కొట్టుకునేవారే. రెస్ట్ ఆఫ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ 63వ ఓవర్‌లో ఈ సంఘటన జరిగింది. 63వ ఓవర్‌లో విదర్భ ఫాస్ట్ బౌలర్ యశ్ ఠాకూర్ మొదటి బంతిని షార్ట్ బౌల్‌గా సంధించాడు. యశ్ ధుల్ అప్పర్ కట్‌కి ప్రయత్నించాడు కానీ బంతి సరిగా కనెక్ట్ కాలేదు. బౌండరీ లైన్ వద్ద అథర్వ టేడే సులభమైన క్యాచ్ అందుకున్నాడు. కీలక వికెట్ కాబట్టి యశ్ ఠాకూర్ సంబరాలు చేసుకున్నాడు. 92 పరుగులు వద్ద అవుట్ అయిన యష్ ధుల్.. యష్ ఠాకూర్ వేడుకలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Also Read: Samsung Galaxy F07 Launch: ఏడు వేలకే.. 50 ఎంపీ కెమెరా, 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ శాంసంగ్ ఫోన్!
యష్ ధుల్ తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. యష్ ఠాకూర్ వైపు వెళ్లడానికి ప్రయత్నించాడు. యష్ ఠాకూర్ కూడా కోపంతో యష్ ధుల్ వైపు దూసుకెళ్లాడు. ఇది గమనించిన అంపైర్లు వెంటనే జోక్యం చేసుకుని ఇద్దరు ఆటగాళ్లను అడ్డుకున్నారు. విదర్భ ప్లేయర్స్ కూడా వెంటనే అక్కడికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. దాంతో పెద్ద గొడవ తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సంఘటనపై వ్యాఖ్యాత వివేక్ రజ్దాన్ స్పందించారు. ‘చిన్నపాటి గొడవ జరిగింది. ఆటగాళ్ళు తమ పరిమితులను అర్థం చేసుకోవాలి. ఆటలో సంయమనం కీలకం’ అని పేర్కొన్నారు.
— Nihari Korma (@NihariVsKorma) October 5, 2025
