Site icon NTV Telugu

Couple Dance: ఇళ్లు లేదా బయట డ్యాన్స్ వేస్తే ఇట్లే ఉంటది మరి

Iran Couple Dancing

Iran Couple Dancing

Couple Dance: ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆందోళనలను నిలువరించేందుకు ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఒక బ్లాగర్ జంటకు అక్కడి రెవెల్యూషనరీ కోర్టు ఒకటి 10 సంవత్సరాల 6 నెలల జైలు శిక్ష విధించింది. ఇరాన్ నిరసనకారులకు మద్దతుగా అస్తియాజ్ హగిగి, అమీర్ మహ్మద్ అహ్మదీ జంట టెహ్రాన్‌లోని ఆజాదీ స్క్వేర్‌లో డ్యాన్స్ చేశారు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఇరాన్ ప్రభుత్వం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది.

Read Also: Minister Amarnath: ఫోన్ రికార్డింగ్, ట్యాపింగ్ వేరు వేరు

దాంతో ఈ జంటను నవంబర్‌ నెలలో అరెస్టు చేశారు. అస్తియాజ్, అమీర్ ఇరాన్‌ జాతీయ భద్రతకు హాని కలిగించారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని రెవెల్యూషనరీ కోర్టు ఆరోపించింది. వీరి ఆన్‌లైన్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా నిషేధం కూడా విధించింది. బహిరంగ ప్రదేశంలో డ్యాన్స్ చేసినందుకు వ్యభిచారాన్ని ప్రోత్సహించారన్న అభియోగాలతో కోర్టు వారిని దోషిగా నిర్ధారించింది. ఈ జంటకు జైలు శిక్షతో పాటు సైబర్‌ స్పేస్‌ను వాడుకున్నందుకు రెండేండ్ల నిషేధం విధించారు. అలాగే, బహిరంగంగా డ్యాన్స్‌ చేయడంపై రెండేండ్ల పాటు ఇరాన్‌ నుంచి వారిని బహిష్కరిస్తూ తీర్పునిచ్చింది.

Exit mobile version