NTV Telugu Site icon

IPL Retentions 2024: ఆర్‌సీబీ భారీ ప్రక్షాళన.. రిలీజ్ లిస్ట్‌లో స్టార్ క్రికెటర్లు! ఆ భారత ప్లేయర్ చాలా లక్కీ

Rcb Won Match

Rcb Won Match

RCB full list of players retained, released ahead of IPL 2024 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) భారీ ప్రక్షాళనకు దిగింది. ఏకంగా 11 మంది ఆటగాళ్లకు గుడ్‌బై చెప్పింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్‌, శ్రీలంక మిస్టరీ స్పిన్నర్‌ వనిందు హసరంగ, టీమిండియా పేస్ బౌలర్ హర్షల్‌ పటేల్‌, న్యూజీలాండ్ క్రికెటర్ మైఖేల్ బ్రేస్‌వెల్‌, దక్షిణాఫ్రికా సీనియర్ పేసర్ వేన్ పార్నెల్‌, ఇంగ్లండ్ ఆటగాడు ఫిన్‌ అలెన్‌, ఇంగ్లీష్ పేసర్ డేవిడ్‌ విల్లే ఉన్నారు.

భారత ప్లేయర్ కేదార్‌ జాదవ్‌ను కూడా ఆర్‌సీబీ వేలంలోకి వదిలేసింది. ఇక ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కెమారూన్‌ గ్రీన్‌ను ముంబై ఇండియన్స్‌ను నుంచి ట్రేడింగ్‌ చేసుకుంది. ఇందుకోసం భారీగానే ఆర్‌సీబీ చెల్లిస్తోంది. అయితే ఎవరూ ఊహించని విధంగా టీమిండియా వెటరన్ ప్లేయర్ దినేశ్‌ కార్తీక్‌ను ఆర్‌సీబీ కొనసాగించింది. డీకే ప్రస్తుతం జట్టులో లేడన్న విషయం తెలిసిందే. అయితే గత ఎడిషన్‌లో బాగా ఆడడంతో అతడిని కొనసాగించింది. ఇక కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్‌ను కొనసాగించిన ఆర్‌సీబీ.. విరాట్‌ కోహ్లీ, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మొహమ్మద్‌ సిరాజ్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది.

రిలీజ్‌ ప్లేయర్స్ లిస్ట్:
వనిందు హసరంగ
హర్షల్‌ పటేల్‌
జోష్‌ హాజిల్‌వుడ్‌
ఫిన్‌ అలెన్‌
మైఖేల్‌ బ్రేస్‌వెల్‌
డేవిడ్‌ విల్లే
వేన్‌ పార్నెల్‌
సోనూ యాదవ్‌
అవినాశ్‌ సింగ్‌
సిద్దార్థ్‌ కౌల్‌
కేదార్‌ జాదవ్‌

Also Read: IPL Retentions 2024: ఇద్దరు స్టార్ ఆటగాళ్లను రిలీజ్‌ చేసిన సన్‌రైజర్స్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌ రిలీజ్, రిటెన్షన్ లిస్ట్ ఇదే!

రిటైన్‌ ప్లేయర్స్ లిస్ట్:
ఫాఫ్‌ డుప్లెసిస్‌ (కెప్టెన్‌)
గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌
విరాట్‌ కోహ్లీ
రజత్‌ పాటిదార్‌
అనూజ్‌ రావత్‌
దినేశ్‌ కార్తీక్‌
సుయాశ్‌ ప్రభుదేశాయ్‌
విల్‌ జాక్స్‌
మహిపాల్‌ లోమ్రార్‌
కర్ణ్‌ శర్మ
మనోజ్‌ భండగే
కెమరూన్‌ గ్రీన్‌ (ట్రేడింగ్‌)
మయాంక్‌ డాగర్‌ (ట్రేడింగ్‌)
వైశాఖ్‌ విజయ్‌ కుమార్‌
ఆకాశ్‌ దీప్‌
మొహమ్మద్‌ సిరాజ్‌
రీస్‌ టాప్లే
హిమాన్షు శర్మ
రజన్‌ కుమార్‌

Show comments