Site icon NTV Telugu

DC Vs MI: టాస్ గెలిచిన డిల్లీ.. MI బ్యాటింగ్.. తుది జట్లు ఇవే..

Dc Vs Mi

Dc Vs Mi

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతోంది. డిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేయనుంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ‘హార్దిక్ ఆరోగ్యం బాగాలేదు, అందుకే ఈరోజు ఆడటం లేదు. గత మ్యాచ్ (KKRపై) గెలవడం జట్టులో పాజిటివ్ ఎనర్జీని ఇచ్చింది. వాంఖెడేతో పోలిస్తే ఇక్కడి పిచ్ వేరుగా ఉంటుంది. టాస్ గురించి ఆలోచించడం లేదు, మేము బ్యాటింగ్ చేయాలనుకున్నాం, అది దక్కినందుకు సంతోషంగా ఉందని సూర్య కుమార్ యాదవ్ అన్నారు.

‘ఇది మా హోమ్ గ్రౌండ్, వికెట్ ఎలా స్పందిస్తుందో చూడాలని బౌలింగ్ ఎంచుకున్నాం. గత మ్యాచ్‌లో 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా గెలవడం మాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. మా జట్టులో ఎలాంటి మార్పులు లేవని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ పేర్కొన్నారు.

డేవిడ్ మిల్లర్ అభిప్రాయం.. IPL వంటి బిజీ టోర్నీలో ప్రయాణాలు, అంచనాల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి విశ్రాంతి (downtime) చాలా ముఖ్యం. పరిస్థితిని బట్టి దూకుడుగా ఆడటమా లేక ఇన్నింగ్స్ నిర్మించడమా అనేది ఆధారపడి ఉంటుంది. గత మ్యాచ్‌లో సమీర్ రిజ్వీ, స్టబ్స్ అద్భుతంగా ఆడి ఒత్తిడి తగ్గించారన్నారు.

తుది జట్లు ఇలా..
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నమన్ ధీర్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బోష్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా. (ఇంపాక్ట్ సబ్స్: మయాంక్ మార్కండే, రాబిన్ మింజ్, రాజ్ బావా, ట్రెంట్ బౌల్ట్, అశ్విని కుమార్)

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):
కెఎల్ రాహుల్(కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రాజ్ నిగమ్, లుంగీ ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్. (ఇంపాక్ట్ సబ్స్: అశుతోష్ శర్మ, ఆకిబ్ నబీ దార్, సమీర్ రిజ్వీ, దుష్మంత చమీర, కరుణ్ నాయర్)

Exit mobile version