Site icon NTV Telugu

PBKS vs MI: నేడే క్వాలిఫయర్ 2 మ్యాచ్.. పంజాబ్ పంతమా..? ముంబై మాస్టర్ ప్లానా..? ఫైనల్ చేరేదెవరు..!

Pbks Vs Mi

Pbks Vs Mi

PBKS vs MI Qualifier 2: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ (MI) మరియు పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు నేడు (జూన్ 1, ఆదివారం) అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడబోతున్నాయి. ముంబైకి ఇది ఆరవ టైటిల్ ఆశతో కూడిన పోరాటం కాగా, పంజాబ్ మాత్రం ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాల్సిందే అంటూ రంగంలోకి దిగుతున్నాయి. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబై గుజరాత్ టైటాన్స్‌పై 20 పరుగుల తేడాతో గెలిచి క్వాలిఫయర్ 2కి ప్రవేశించింది.

Read Also: Always Shubhu Baby: హార్దిక్, శుభ్‌మన్ గిల్ మధ్య గొడవ.. “ఆల్వేస్ శుభూ బేబీ” అంటూ..!

ఇకపోతే.. రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ వంటి మెరుగైన ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు జానీ బెయిర్‌స్టో, రిచర్డ్ గ్లీసన్ ఫామ్‌లో ఉండడం అన్ని ముంబైకి కలిసి వచ్చే అంశాలే. ఇక మరోవైపు చూస్తే.. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిన పంజాబ్, ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్ చేరాలంటే వారి ఆటతీరు మెరుగుపర్చాల్సిందే. బౌలింగ్ విభాగంలో మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్ లేకపోవడం స్పష్టంగా ప్రభావం చూపింది. అర్శదీప్ సింగ్ అనుభవలేమితనంతో బౌలింగ్ యూనిట్ ను నడిపించాల్సిన బాధ్యతలో ఉన్నాడు. అలాగే ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్యా ఓపెనింగ్ జోడీ మరింత మెరగాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఈ సీజన్‌లో ముంబైపై ఇప్పటికే ఒక గెలుపు నమోదుచేసిన పంజాబ్, అదే ఆశయంతో ఈ మ్యాచ్‌ లోకి అడుగుపెడుతోంది.

Read Also: Flash Floods: ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తుతున్న వర్షాలు.. రెండు రోజుల్లో 30 మృతి..!

ఇక ఇరు జట్ల హెడ్ టు హెడ్ లో మాత్రం ముంబై స్వల్పంగా ముందంజలో ఉంది. మొత్తంగా 33 మ్యాచ్‌లు జరగగా.. ఇందులో ముంబై 17 మ్యాచ్ లలో గెలవగా.., పంజాబ్ 16 మ్యాచ్ లలో విజయం నమోదు చేసింది. ఈ గణాంకాలు రెండు జట్ల మధ్య పోరాటాన్ని సమానంగా చూపుతున్నా.. ముంబయి ఫార్మ్‌లో ఉండడం కీలక అంశంగా భావించవచ్చు. ఇక అహ్మదాబాద్ పిచ్ చూస్తే.. నరేంద్ర మోదీ స్టేడియంలో పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ప్రారంభంలో స్వల్ప తడితనంతో బౌలర్లకు సహకారం ఉండొచ్చూ కానీ, వేడిగాలుల వల్ల అది త్వరగా ఆరిపోతుంది. ఇక నేడు ఆడబోయే ఇరుజట్లను ఇలా అంచనా వేయవచ్చు. నేటి మ్యాచ్ కు ఎటువంటి వర్షం ఇబ్బంది కలిగించిందని వాతావరణ రిపోర్ట్ తెలుపుతోంది.

పంజాబ్ కింగ్స్:
ప్రియాంశ్ ఆర్యా, ప్రభ్‌సిమ్రన్ సింగ్, జోష్ ఇంగ్లిస్ (W), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నేహాల్ వాధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, హర్ప్రీత్ బ్రార్, అర్శదీప్ సింగ్, కైల్ జమీసన్
ఇంపాక్ట్ సబ్: సూర్యాంశ్ షెడ్జే

ముంబై ఇండియన్స్:
జానీ బెయిర్‌స్టో (W), రోహిత్ శర్మ, కార్బిన్ బోష్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నామన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా
ఇంపాక్ట్ సబ్: కర్ణ్ శర్మ.

Exit mobile version