NTV Telugu Site icon

RCB vs LSG Dream 11 Prediction: బెంగళూరు, లక్నో డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!

Rcb Vs Lsg Dream 11 Prediction

Rcb Vs Lsg Dream 11 Prediction

RCB vs LSG Dream11 Captain and Vice-Captain Choices: ఐపీఎల్‌ 2024లో భాగంగా ఈరోజు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్‌ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయాన్ని మాత్రమే అందుకున్న ఆర్‌సీబీ.. లక్నోపై గెలవాలని చూస్తోంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ గెలుపు, ఓ ఓటమిని ఎదుర్కున్న ఎల్‌ఎస్‌జీ.. మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది.

ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్లు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లలో తలపడ్డాయి. మూడు మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ గెలవగా.. ఓ మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీ విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ 2024 మ్యాచులు రెండు జరగగా.. ఛేదనకు దిగిన జట్టే గెలిచింది. ఇక్కడ బ్యాటర్లు పండగ చేసుకుంటారు. పేసర్లు ఈ వికెట్‌పై ప్రభావం చూపుతారు. స్పిన్నర్లు కూడా సహకారం ఉంటుంది.

ఐపీఎల్‌లో ఎల్‌ఎస్‌జీపై ఆర్‌సీబీకి మంచి ఆధిపత్యం ఉంది. అయితే ప్రస్తుత సీజన్‌లో ఆర్‌సీబీతో పోలిస్తే ఎల్‌ఎస్‌జీ పటిష్టంగా కనిపిస్తోంది. లక్నోకు మంచి బ్యాటింగ్, బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. డికాక్‌, రాహుల్‌, పడిక్కల్‌, స్టోయినిస్‌, పూరన్‌, మయాంక్‌ యాదవ్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, మొహిసిన్‌ ఖాన్‌, రవి భిష్ణోయ్‌ జట్టులో ఉన్నారు. ఆర్‌సీబీలో డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌, గ్రీన్‌, సిరాజ్‌, యశ్‌ దయాల్‌, అల్జరీ జోసఫ్‌లు ఉన్నా ఇప్పటివరకు రాణించలేదు. మరి లక్నోతో మ్యాచ్‌లో బెంగళూరు ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

తుది జట్లు (అంచనా):
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, కామెరూన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, ఆర్‌ఎమ్ పాటిదార్, దినేష్ కార్తీక్ (కీపర్), అనుజ్ రావత్, ఎంజే డాగర్, విజయ్‌కుమార్ వైషాక్, లాకి ఫెర్గూసన్, మహమ్మద్ సిరాజ్.
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ (కీపర్), దేవదత్ పడిక్కల్, నికోలస్ పూరన్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్.

డ్రీమ్ 11 టీమ్:
కీపర్ – క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్
బ్యాట్స్‌మెన్ – విరాట్ కోహ్లీ (వైస్ కెప్టెన్), ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), లోకేష్ రాహుల్
ఆల్ రౌండర్లు – గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, కృనాల్ పాండ్యా
బౌలర్లు – మహ్మద్ సిరాజ్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్