NTV Telugu Site icon

IPL 2023 : అక్షర్ పటేల్ దెబ్బ.. పెవిలియన్ కు సూర్యకుమార్ యాదవ్

Surya Kumar

Surya Kumar

ఐపీఎల్ లో ఆటగాళ్లు గాయపడడం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడి, వన్డే వర్డ్ కప్ కే అనుమానంగా మారగా.. ఇప్పుడు ఈ లిస్టులో సూర్యకుమార్ యాదవ్ కూడా చేరాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతన్న మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సూర్యకుమార్ తడబడ్డాడు. హృతీక్ షోకీన్ బౌలింగ్ లో అక్షర్ పటేల్ కొట్టిన షాట్ ని అంచనా వేయడంలో ఫెయిల్ అయిన సూర్య క్యాచ్ మిస్ చేసి.. సిక్సర్ ఇచ్చేశాడు.. అయితే అతని బ్యాడ్ టైం అక్కడితో ఆగలేదు.. జాసన్ బెహ్రాన్ డార్ఫ్ బౌలింగ్ లో మరోసారి అక్షర్ పటేల్ కొట్టిన షాట్ ని క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నించిన సూర్యకుమార్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు.

Read Also : Celina Jaitley: తండ్రికొడుకులతో పడుకుంది అన్నందుకు ఇచ్చి పడేసిన మంచు విష్ణు హీరోయిన్

సూర్యకుమార్ యాదవ్ చేతుల సంధుల్లో నుంచి వెళ్లిన బాల్ నేరుగా అతని నూదిటి భాగాన తగిలి బౌండరీ అవతల పడింది. నొప్పితో బాధపడిన సూర్యకుమార్, ఫిజియో సాయంతో పెవిలియన్ బాట పట్టాడు. అతని గాయం గురించి అప్ డేట్ రావాల్సి ఉంది. సిక్స్ పోతే పోయింది. ఈ మ్యాచ్ పోతే పోయింది.. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ ఫెయిల్ అయితే అయింది. ఇవన్నీ భారత్ క్రికెట్ ని పెద్దగా ప్రభావితం చేయవు.. కానీ సూర్యకుమార్ యాదవ్.. టీమిండియా కీ ప్లేయర్.. టీ20ల్లో నెంబర్ వన్ బ్యాటర్ గా ఉన్నాడు.

Read Also : IPL 2023 : ఢిల్లీ ఆలౌట్.. బ్యాటింగ్ లో రెచ్చిపోతున్న ముంబై

టీమిండియా ఇప్పటికే శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా రూపంలో ముగ్గురు కీ ప్లేయర్లను కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ పైనే భారీ ఆశలు పెట్టుకుంది. ఐసీసీ టోర్నీలోను దృష్టిలో ఉంచుకుని కీలక ఆటగాళ్లు గాయపడకుండా చూసుకుంటామని చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీమ్ లోనే సూర్య రూపంలో భారత ప్రధాన ఆటగాడు గాయపడటం విశేషం.