NTV Telugu Site icon

Devara : పది ఊర్లకు కాపరిగా ఎన్టీఆర్.. ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్..

Devara

Devara

Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”.ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దేవర సినిమా అక్టోబర్ 10 న దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన “ఫియర్ సాంగ్ ” ప్రేక్షకులకు ,ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేసింది.నెట్టింట ఈ సాంగ్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది.

Read Also :Manjummel Boys : ఇళయరాజా కు మంజుమ్మల్ బాయ్స్ ప్రొడ్యూసర్ కౌంటర్..

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేసిన ఒక వ్యక్తి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ వ్యక్తి మాట్లాడుతూ.. దేవర సినిమాలో ఎన్టీఆర్ సముద్రం దగ్గర పది ఊర్లకు కాపరిగా ఉంటాడు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తానే అన్ని చూసుకుంటూ ఉంటాడు. అలాగే ఈ సినిమాలో సముద్రం దగ్గర ఫైట్ సీన్ అదిరిపోతుంది.ఏకంగా పదివేల మందితో ఆ ఫైట్ సీన్ జరుగుతుంది. సముద్రం అంతా రక్తంతో నిండిపోతుంది.ఆ యాక్షన్ సీన్స్ లైవ్ లో చూసి మేము ఆశ్చర్య పోయాము .ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన హైలైట్ గా నిలుస్తుందని ఆ వ్యక్తి తెలిపాడు.ప్రస్తుతం ఈ న్యూస్  నెట్టింట  వైరల్ అవుతుంది.