Site icon NTV Telugu

INDW Vs PAKW: పాకిస్థాన్‌తో ప్రపంచకప్‌ మ్యాచ్.. టాస్‌లో టీమిండియాను మోసం చేసిన మ్యాచ్ రిఫరీ!

Indw Vs Pakw Toss

Indw Vs Pakw Toss

మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా దాయాదులు భారత్, పాకిస్తాన్ జట్లు కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో తలపడుతున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ ప్రక్రియ వివాదంకు తెరలేపింది. మ్యాచ్‌లో టాస్ సందర్భంగా రిఫరీ సహా వ్యాఖ్యాత పెద్ద తప్పిదం చేశారు. తప్పిదాన్ని సద్వినియోగం చేసుకున్న పాక్ కెప్టెన్ ఫాతిమా సనా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ రిఫరీ నిర్ణయం వెనుక పెద్ద కుట్ర ఉందని ఫాన్స్ మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టాస్‌ సమయంలో భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, పాకిస్తాన్ సారథి ఫాతిమా సనా సహా మ్యాచ్ రిఫరీ శాండ్రే ఫిట్జ్, టాస్ ప్రెజెంటర్ మెల్ జోన్స్ మైదానంలో ఉన్నారు. హర్మన్‌ప్రీత్ నాణేన్ని గాల్లోకి విసరగా.. ఫాతిమా సనా ‘టెయిల్స్’ అని చెప్పింది. అయితే కాయిన్ ‘హెడ్స్’గా పడింది. మ్యాచ్ రిఫరీ టాస్ ఫలితాన్ని హెడ్స్ అని ప్రకటించి.. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా టాస్ గెలిచిందని ప్రకటించారు. పాక్ కెప్టెన్ టాస్ కోల్పోయినప్పటికీ.. రిఫరీ మాత్రం ఆమెనే గెలిచినట్లు స్పష్టం చేశారు. ఆ సమయంలో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా మౌనంగా ఉండిపోయింది. తప్పును సరిదిద్దుకునే బదులు.. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కూడా ఆ సమయంలో ఆ తప్పును గమనించలేదు.

Also Read: Viral Video: మైదానంలో గొడవపడ్డ ఇద్దరు భారత ప్లేయర్స్.. అంపైర్లు లేకుంటే కొట్టుకునేవారే!

టాస్ వీడియో కాసేపటికి సోషల్ మీడియాలో వైరల్ అయింది. మ్యాచ్ రిఫరీ, వ్యాఖ్యాత చేసిన తప్పు కారణంగా భారత్ టాస్ కోల్పోయింది. క్రికెట్ మ్యాచ్‌లలో ఇలా జరగదు. ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే హర్మన్‌ప్రీత్ కౌర్ ఎందుకు అడగలేదు. బహుశా స్టేడియం శబ్దం కారణంగా ఫాతిమా మాటలు ఆమెకు సరిగ్గా వినిపించకపోవచ్చు. తప్పును సరిదిద్దడం మ్యాచ్ రిఫరీ, ప్రెజెంటర్ బాధ్యత కానీ.. వారు కూడా ఏమీ అనలేదు. ఈ ఇద్దరు కూడా ఏదైనా గందరగోళానికి గురైఉండొచ్చు అని నిపుణులు అంటున్నారు. ఏదేమైనా పాక్ కెప్టెన్ ఫాతిమా ఇచ్చిన టాస్ కాల్ మైక్రోఫోన్‌లో స్పష్టంగా టెయిల్స్ అని వినబడుతోంది. టాస్‌లో టీమిండియాను మోసం చేసిన మ్యాచ్ రిఫరీ అని ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version