Indore: మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని నందలాల్‌పురా ప్రాంతంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. రెండు గ్రూపుల ట్రాన్స్‌జెండర్ల మధ్య వివాదం తీవ్రంగా మారింది. దీంతో ఒక గ్రూపులోని దాదాపు 24 మంది ట్రాన్స్‌జెండర్లు ఫినైల్ మూకుమ్ముడిగా ఫినాయిల్ తాగారు. తమ శిబిరం వెలుపల కుప్పకూలిపోయారు. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే.. పోలీసులు, అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అందరినీ వెంటనే మహారాజా యశ్వంత్‌రావు హాస్పిటల్ (MY) ఆసుపత్రికి తరలించారు. రెండు గ్రూపుల మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయని, బుధవారం అకస్మాత్తుగా హింసాత్మకంగా మారినట్లు తెలుస్తోంది.
READ MORE: lip kiss :మరీ ఇంత కరువులో ఉన్నావేంట్రా.. వాళ్లతో కూడానా..
మరో నలుగురు ట్రాన్స్‌జెండర్లు పెట్రోల్ బాటిళ్లతో ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడంతో హాస్పిటల్ బయట గందరగోళం చెలరేగింది. న్యాయం జరగకపోతే తమను నిప్పంటించుకుంటామని బెదిరిస్తూ ఆసుపత్రి గేటు వద్ద కేకలు వేశారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, పెట్రోల్ బాటిళ్లను లాక్కొని శాంతింపజేశారు. ఆసుపత్రి ఆవరణలో చాలా సేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. పరిస్థితిని నియంత్రించడానికి ఏకంగా మూడు పోలీస్ స్టేషన్ల నుంచి బలగాలను మోహరించారు.
READ MORE: Legally Veer : ‘లీగల్లీ వీర్’ – థియేటర్ హిట్ తర్వాత OTT స్ట్రీమింగ్‌లోకి !
ఇండోర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సమాచారం అందిన వెంటనే తమ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. కొంతమంది ట్రాన్స్‌జెండర్లు ఫినైల్ సేవించారని గుర్తించారు. పోలీసులు వెంటనే అంబులెన్స్‌లకు ఫోన్ చేసి వారిని ఆసుపత్రికి తరలించారు. వారందరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. అయితే, ప్రస్తుతం వారు మాట్లాడలేకపోతున్నారు. వారి స్టేట్‌మెంట్‌ల అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
READ MORE: సరికొత్త AI ఫీచర్లు, OLED స్క్రీన్, M5 చిప్‌తో ఆపిల్ కొత్త iPad Pro లాంచ్..!
జాతీయ మీడియా సంస్థల నివేదికల ప్రకారం.. ఇండోర్‌లో రెండు ప్రధాన లింగమార్పిడి వర్గాల మధ్య చాలా రోజులుగా వివాదం చెలరేగుతోంది. రెండు ట్రాన్స్‌జెండర్ గ్రూపుల మధ్య ఆస్తి వివాదం కొనసాగుతోంది. పాయల్, సీమా గురువులకు చెందిన మద్దతుదారులు సింహాసనం కోసం అనేకసార్లు ఘర్షణ పడ్డారు. ఈ వివాదం కేవలం నాయకత్వం లేదా డబ్బు గురించి మాత్రమే కాదు.. మత మార్పిడి సమస్య కూడా అని చెబుతున్నారు. హిందూ, ముస్లిం ట్రాన్స్‌జెండర్ల మధ్య మత మార్పిడిపై వివాదం తలెత్తిందని తెలుస్తోంది. ఏ వర్గం మాతం మారింది.. ఎందుకు గొడవ తలెత్తిందనే పూర్తి సమాచారం తెలియరాలేదు. ఈ అంశం తీవ్రత దృష్ట్యా, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేశారు.
