Indigo: దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సహ వ్యవస్థాపకుడు రాకేష్ గంగ్వాల్ తన వాటాను 5 నుంచి 8 శాతం వరకు తగ్గించుకోవచ్చని తెలుస్తోంది. బ్లాక్ డీల్ ద్వారా ఈ వారం చివరి నాటికి తమ వాటాను తగ్గనుంది. ఈ వాటా దీని విలువ సుమారు రూ.7500 కోట్ల కంటే ఎక్కువగా ఉండవచ్చు. స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం.. మార్చి 31 నాటికి ఇంటర్‌గ్లోబ్‌లో రాకేష్ గంగ్వాల్, అతని భార్య శోభా గంగ్వాల్ వరుసగా 13.23 శాతం, 2.99 శాతం వాటాలను కలిగి ఉండగా, వారి చింకార్పు ఫ్యామిలీ ట్రస్ట్ 13.5 శాతం కలిగి ఉన్నారు. జూలై 15న సహ వ్యవస్థాపకుడు రాకేష్ గంగ్వాల్, అతని కుటుంబం బహిరంగ ఒప్పందం ద్వారా తమ వాటాను తగ్గించుకోవచ్చని నివేదికలో చెప్పబడింది.
Read Also:Cowin Portal: నుంచి డేటా లీక్.. టెలిగ్రామ్‌లో కోట్లాది మంది వ్యక్తిగత వివరాలు ?
2022లో కంపెనీ బోర్డుకు రాజీనామా
శోభా గంగ్వాల్ ఫిబ్రవరిలో కంపెనీలో తన వాటాను 4 శాతానికి పైగా తగ్గించుకున్నారు. ఈ విషయంలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, గంగ్వాల్ కుటుంబం నుండి అధికారిక ప్రకటన రాలేదు. రాకేష్ గంగ్వాల్ ఫిబ్రవరి 2022లో కంపెనీ బోర్డుకు రాజీనామా చేశారు. ఐదేళ్లలో ఎయిర్‌లైన్‌లో తన వాటాను తగ్గించుకుంటానని చెప్పారు. 2006లో ఇండిగో సహ-స్థాపన చేసిన రాకేష్ గంగ్వాల్, రాహుల్ భాటియా 2020 ప్రారంభంలో కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లో కొన్ని నిబంధనలను మార్చాలని కోరడంతో విడిపోయారు.
Read Also:CM YS Jagan: నాలుగేళ్లలోనే విద్యారంగంలో చాలా మార్పులు తీసుకొచ్చాం
కంపెనీ షేర్లలో పతనం
ఈ వార్తల తరువాత ఏవియేషన్ కంపెనీ షేర్లలో క్షీణత కనిపించింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫ్లాగ్‌షిప్ ఇండెక్స్ సెన్సెక్స్‌లో కంపెనీ షేరు 2.54 శాతం క్షీణించి రూ.2399.25 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ సెషన్‌లో ఇది రూ.2377.95కి దిగజారింది. శుక్రవారం కంపెనీ షేరు రూ.2461.80 వద్ద ముగిసింది. ప్రస్తుత సంవత్సరంలో కంపెనీ షేర్లు 19 శాతానికి పైగా పెరిగాయి. GoFirst పతనం అయిన తర్వాత ఇంటర్‌గ్లోబ్ షేర్లు జంప్‌ను చూశాయి.