కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. వరుసగా ఖాళీలు ఉన్న శాఖలో ఉద్యోగాలను విడుదల చేస్తుంది..తాజాగా ఇండియన్ నేవిలో ఖాళీలు ఉన్న పలు ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతుంది.. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం డైరెక్ట్ ఎంట్రీ పెట్టీ ఆఫీసర్/ చీఫ్ పెట్టీ ఆఫీసర్ (స్పోర్ట్స్ ఎంట్రీ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి..12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అభ్యర్థులు మరింత సమాచారం కోసం ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ www.indiannavy.nic.inని సందర్శించవచ్చు.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
అర్హతలు..
ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి..
వయోపరిమితి..
ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థుల వయస్సు కనీసం 17.5 సంవత్సరాలు, గరిష్టంగా 25 సంవత్సరాలు మించకూడదు. రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది..
జీతం..
నెలకు రూ. 14,600..
ఇకపోతే వైద్య పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు..
ఎలా దరఖాస్తు చేయాలి?
అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను అవసరమైన పత్రాలతో పాటు క్రింది చిరునామాకు పంపాలి.
కార్యదర్శి,
ఇండియన్ నేవీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్,
7వ అంతస్తు,
చంక్య భవన్,
ఇంటిగ్రేటెడ్ ప్రధాన కార్యాలయం,
MoD (నేవీ),
న్యూఢిల్లీ-110021.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఇదే లాస్ట్ రోజు సాయంత్రం 5 గంటలలోపు అప్లై చేసుకోవాలి..మరింత సమాచారం కోసం అధికార వెబ్ సైట్ ను సందర్శించాలి..
