NTV Telugu Site icon

Anurag Maloo: సజీవంగా దొరికిన మౌంటెనీర్ అనురాగ్‌ మాలూ.. పరిస్థితి విషమం

Anurag Maloo

Anurag Maloo

Anurag Maloo: గత వారం నేపాల్‌లోని అన్నపూర్ణ పర్వతం దిగుతుండగా జారిపడిన భారత పర్వతారోహకుడు అనురాగ్ మాలూ సజీవంగా దొరికాడు. మౌంట్ అన్నపూర్ణ అధిరోహించిన అత‌ను గ‌త వారం మిస్సయ్యాడు. అయితే అత‌ను స‌జీవంగా ఉన్నట్లు తేలింది. విష‌మ ప‌రిస్థితుల్లో ఉన్న అత‌న్ని ఆస్పత్రికి త‌ర‌లించార‌ని సోద‌రుడు సుధీర్ వెల్లడించాడు. గ‌త వారం కొంత మంది ప‌ర్వతారోహ‌కుల‌తో క‌లిసి అనురాగ్ మౌంట్ అన్నపూర్ణ ఎక్కాడు. కానీ ఏప్రిల్ 17న దిగుతుండగా 6,000 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు కింద జారిపడ్డాడు.

Read Also: Tragedy : లండన్ బీచ్ లో కొట్టుకుపోయిన హైదరాబాద్ అమ్మాయి

ప్రపంచవ్యాప్తంగా 8,000 మీటర్ల పైన ఉన్న మొత్తం 14 శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో అనురాగ్‌ మాలూ అన్నారు. దాంతో పాటు యూఎన్గ్లోబల్ గోల్స్‌ను సాధించే లక్ష్యంతో ఆయన ఈ మిషన్‌ చేపట్టారు. దీనిని సాధించడం కోసం మొత్తం ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తైన పాయింట్లను అధిరోహించే లక్ష్యంతో ఉన్నారు. రెక్స్ కార‌మ్ వీర్ చ‌క్ర అవార్డును అత‌ను గెలుచుకున్నాడు. 2041 అంటార్కిటికా యూత్ అంబాసిడ‌ర్‌గా ఇండియా నుంచి ఎంపిక‌య్యాడు.

Show comments