NTV Telugu Site icon

Paris Olympics 2024: సెమీస్లోకి భారత హాకీ మ్యాచ్.. పెనాల్టీ గోల్లో విజయం

Hocley

Hocley

పారిస్ ఒలింపిక్స్ హాకీ క్వార్టర్స్లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. బ్రిటన్తో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో మొదట ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది. దీంతో.. మ్యాచ్ టైగా ముగిసింది. ఆ తర్వాత షూటౌట్ జరిగింది. అందులో బ్రిటన్ జట్టు కొట్టే గోల్స్ను అడ్డుకోవడంలో కాస్త తడబడిన భారత్ ఆటగాళ్లు అందుకు ధీటుగా గోల్స్ చేశారు. షూటౌట్ 4-2 తేడాతో భారత్ విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లింది. దీంతో.. షూటౌట్‌లో బ్రిటన్‌ను ఓడించి భారత హాకీ జట్టు వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది.

Read Also: Hardeep Singh Nijjar: నిజ్జర్ హత్య నిరసనల్లో పాల్గొన్న పాకిస్తాన్ వ్యక్తి హత్య..

ఈ మ్యాచ్‌లో భారత్ 10 మంది ఆటగాళ్లతో ఆడింది. ఎందుకంటే రెండో క్వార్టర్‌లో అమిత్ రోహిదాస్‌కు రెడ్ కార్డ్ ఇచ్చారు. దాని కారణంగా అతను మొత్తం మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అయినా పట్టు వదలని భారత జట్టు చివరి వరకు బ్రిటన్‌కు గట్టిపోటీనిచ్చింది. ఈ విధంగా భారత జట్టు పతకం దిశగా మరో అడుగు ముందుకేసింది. సెమీఫైనల్‌లో విజయం సాధిస్తే భారత్‌కు కనీసం రజత పతకం ఖాయం. ఆగస్టు 6వ తేదీ మంగళవారం భారత్ సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Read Also: Paris Olympics: క్వార్టర్ ఫైనల్స్లో గెలిచిన తర్వాత భావోద్వేగానికి గురైన ఇమానే ఖలీఫ్..