Site icon NTV Telugu

Shubhanshu Shukla: అంతరిక్షంలో భారత జెండా.. ‘Ax-4’ మిషన్‌లో తొలి అనుభవం పంచుకున్న కెప్టెన్ శుభాంశు శుక్లా..!

Shubhanshu Shukla

Shubhanshu Shukla

Shubhanshu Shukla: భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభంశు శుక్లా ‘ఆక్సియమ్ మిషన్ 4 (Ax-4)లో భాగంగా అంతరిక్ష ప్రయాణంలో పాల్గొన్న భారతీయుడిగా చరిత్రలోకి నిలిచారు. 1984లో రాకేష్ శర్మ ప్రయాణం చేసిన తర్వాత 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా నిలిచారు. బుధవారం (జూన్ 25) తెల్లవారుజామున SpaceX Dragon అంతరిక్ష నౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన Ax-4 బృందం తమ మొదటి ప్రత్యక్ష ప్రసారాన్ని భూమిపైన ఉన్న ప్రజలతో పంచుకుంది.
Read Also:Yogi Adityanath: కన్వర్ యాత్ర మార్గంలో వ్యాపారులు తమ పేర్లను దుకాణాలపై ప్రదర్శించాల్సిందే
ఈ సందర్భంగా శుక్లా తన భావోద్వేగాలను పంచుకున్నాడు. 30 రోజుల క్వారంటైన్ తర్వాత లాంచ్‌ ప్యాడ్‌ పై ‘గ్రేస్’ క్యాప్సూల్‌ లో కూర్చున్నప్పుడు ‘ఇప్పుడైనా లాంచ్ కావాలి’ అనిపించిందని.. లాంచ్ క్షణం రానే వచ్చిందని.. నన్ను గట్టిగా నెట్టేసిందని.. ఆ తరువాత ఒక్కసారిగా శబ్దం మాయం అయ్యిందని అన్నారు. అలాగే శూన్యంలో తేలుతూ ఉండటం, నిజంగా ఓ మాయాగా ఉందన్నారు. అలాగే, ఇది నా వ్యక్తిగత ప్రయాణం కాదు. ఈ విజయంలో భాగమై ఉన్న ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. మనందరి కల ఈ ప్రయాణం. అంటూ మాట్లాడారు. ఇంకా క్యాప్సూల్‌ లోని స్వాన్ మాస్కట్ గురించి మాట్లాడుతూ.. “ఇది విజ్ఞానానికి, శాంతికి, ఆత్మబలానికి ప్రతీక” అని అన్నారు.


Read Also:Train Tickets Hike: ప్రధాని మోడీకి సీఎం స్టాలిన్ లేఖ.. రైలు టిక్కెట్‌ ధరలు పెంచొద్దని వినతి!

ఇది ఇలా ఉండగా.. భూమి వదిలి స్పేస్‌లోకి వెళ్లిన తర్వాత శుక్లా భారతదేశ ప్రజలతో ప్రత్యేక సందేశం పంచుకున్నారు. అందులో “నమస్కారం నా భారతీయులారా, ఇది ఒక అద్భుత ప్రయాణం. 41 ఏళ్ల తర్వాత మనం మళ్లీ అంతరిక్షంలో ఉన్నాం. నేను ధరించిన త్రివర్ణ పతాకం నా గుండెకు దగ్గరగా ఉంది. ఇది కేవలం అంతరిక్ష కేంద్రానికి వెళ్లడం కాదు, ఇది భారత మానవ అంతరిక్ష ప్రోగ్రామ్‌కు నూతన ఆరంభం. మీరు అందరూ భాగస్వాములవ్వండి. గర్వంగా ఉండండి. జై హింద్.! జై భారత్.! అంటూ తెలిపారు.

అలాగే ఈ ప్రయాణంలో మరో ఆస్ట్రోనాట్ తిబోర్ కాపు మాట్లాడుతూ.. “మేము నాలుగు దేశాలకు చెందినవాళ్లం. దాదాపు ప్రపంచ జనాభాలో 30% కు మేము ప్రతినిధులం. అంతరిక్షం నుంచి చూస్తే మీ అందరినీ చూస్తున్నాం అని అన్నారు. Ax-4 బృందం లోని శుక్లా, విట్సన్, ఉజ్నాన్స్కీ, కాపు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో 14 రోజులు గడుపుతారు. ఈ సమయంలో వారు సైన్స్ ప్రయోగాలు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, ఇంకా కొన్ని కమర్షియల్ పనుల్లో పాల్గొంటారు.

Exit mobile version