Site icon NTV Telugu

Indian CEOs In US: ట్రంప్‌కు షాక్ ఇచ్చిన రెండు దిగ్గజ అమెరికా కంపెనీలు.. సీఈఓలుగా భారతీయుల నియామకం

Indian Ceos In Us

Indian Ceos In Us

Indian CEOs In US: ఇది నిజంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు షాక్. ఎందుకంటే ఆయన హెచ్1బీ వీసాల ఫీజును 215 డాలర్ల నుంచి లక్ష డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక కీలక పరిణామం వెలుగుచూసింది. అది ఏంటని ఆలోచిస్తున్నారా.. రెండు అమెరికా దిగ్గజ కంపెనీలు తమ సంస్థలకు సీఈఓలుగా ఇద్దరు ఇండియన్‌ల పేర్లను ప్రకటించాయి. హెచ్1బీ వీసాలపై ట్రంప్ ఎఫెక్ట్ టైంలో ఈ సంస్థలు తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇంతకీ ఈ రెండు కంపెనీలు ఏంటీ, ఆ ఇద్దరు ఇండియన్ సీఈఓలు ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Ola: ఓలా ఫెస్టివల్ ఆఫర్స్.. ఎలక్ట్రిక్ స్కూటర్లు కేవలం రూ. 49,999కే.. త్వరపడండి

టి-మొబైల్, మల్సోన్ కూర్స్ రథసారథులుగా ఇండియన్స్..
అమెరికా టెలికాం దిగ్గజ సంస్థ టి-మొబైల్ తమ కంపెనీకి నూతన సీఈఓగా 55 ఏళ్ల శ్రీనీ గోపాలన్‌లను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఆయన నియామకం నవంబర్ 1న నుంచి అమలు లోకి రానున్నట్లు సంస్థ ప్రకటించింది. శ్రీనీ గోపాలన్‌ ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి. ప్రస్తుతం ఆయన టి-మొబైల్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఆయన కెరీర్‌ను హిందుస్థాన్ యునిలివర్లో మేనేజ్మెంట్ ట్రైనీగా ప్రారంభించారు. అనంతరం ఆయన భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, క్యాపిటల్ వన్, డ్యూష్ టెలికామ్ వంటి సంస్థలలో పలు కీలక పదవులు నిర్వహించి, టి-మొబైల్ కంపెనీలో చేరారు. సంస్థలో అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం సీఈఓగా స్థాయికి చేరుకున్నారు. ఆయను కంపెనీ సీఈఓగా ఎంపిక చేయడంపై గోపాలన్ ఆనందం వ్యక్తం చేశారు.

చికాగోకు చెందిన పానీయాల సంస్థ మల్సోన్ కూర్స్ కూడా కంపెనీకి నూతన సారథిని ప్రకటించింది. కంపెనీకీ నూతన సీఈఓగా 49 ఏళ్ల రాహుల్ గోయల్ అనే ఇండియన్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. రాహుల్ మైసూర్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆయన మల్సోన్ కూర్స్ సంస్థలో 24 ఏళ్లుగా పని చేస్తున్నారు. కంపెనీని తనకు కల్పించిన ఈ అవకాశంతో సంస్థను ముందుకు తీసుకువెళ్లడానికి, ఎటువంటి సవాళ్లను అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు రాహుల్ పేర్కొన్నారు.

ఇప్పటికే భారత సంతతికి చెందిన నిపుణులు ప్రస్తుతం అమెరికాలోని అత్యంత ప్రభావవంతమైన కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు. ఉదాహరణలలో మైక్రోసాఫ్ట్‌లో సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్లోలో సుందర్ పిచాయ్ సీఈఓలు పని చేస్తున్నారు. అలాగే ఫార్చ్యూన్ 500 కంపెనీలలో ఇతర భారతీయులు స్థానం సంపాదించుకున్నారు. తాజాగా అమెరికాలో ఈ రెండు సంస్థలు తీసుకున్న నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే భారతదేశంతో సహా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్లు అమెరికా కంపెనీలకు ఉన్నత స్థాయి పదవులను అధిరోహించడం తరచుగా రాజకీయ పరిశీలనకు దారి తీస్తున్నట్లు సమాచారం. ఈ నియామకాలను కొన్నిసార్లు MAGA (మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్) రాడికల్స్.. అమెరికన్ ఉద్యోగాలను తీసుకునే వ్యక్తులుగా అభివర్ణిస్తున్నారు.

READ ALSO: US Afghanistan Tensions: ట్రంప్ ఎఫెక్ట్.. తాలిబన్ సుప్రీం లీడర్‌కు హైసెక్యూరిటీ..!

Exit mobile version