Site icon NTV Telugu

Indian Army AK-630 Guns: భారత్ అమ్ముల పోదిలోకి కొత్త ఆయుధాలు.. పాక్‌కు హెచ్చరిక జారీ చేసిన ఆర్మీ చీఫ్

Indian Army Ak 630 Guns

Indian Army Ak 630 Guns

Indian Army AK-630 Guns: ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి భారత్ తన సైనిక శక్తి సామర్థ్యాలను పెంచుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాలలో నివసించే ప్రజలు, మతపరమైన ప్రదేశాల భద్రతను మరింత బలోపేతం చేయడానికి భారత ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు కొత్త AK-630 ఎయిర్ డిఫెన్స్ గన్‌లను కొనుగోలు చేయడానికి సైన్యం
తాజాగా టెండర్ జారీ చేసింది. ఈ కొత్త ఆయుధాల ప్రత్యేకలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Kantara vs Kantara chapter 1: నటులు రిపీట్.. కానీ ఒక్క పాత్రా రిపీట్ కాలేదే!

AK-630 ఎయిర్ డిఫెన్స్ గన్‌ ప్రత్యేకతలు..
AK-630 ఎయిర్ డిఫెన్స్ గన్‌‌లు 30-మిల్లీమీటర్ల మల్టీ-బారెల్ ఫైరింగ్ సిస్టమ్ కలిగి ఉంటాయి. ఇవి నిమిషానికి దాదాపు 3,000 రౌండ్లు కాల్చగలవు. పలు నివేదికల ప్రకారం.. ఈ కొత్త తుపాకీ వ్యవస్థలను సరిహద్దు ప్రాంతాలలో వినియోగించనున్నారు. వీటిని డ్రోన్లు, రాకెట్లు, ఫిరంగిదళాలు, మోర్టార్ల వంటి ముప్పులను ఎదుర్కోవడానికి మోహరిస్తారని చెబుతున్నారు. ప్రతి తుపాకీని ట్రెయిలర్‌పై అమర్చుతారు, ఇవి దాదాపు 4 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. మరో విశేషం ఏమిటంటే ఇవి అన్ని వాతావరణ పరిస్థితులలో లక్ష్యాన్ని కచ్చితంగా గుర్తించడానికి వీలు కల్పించే అన్ని వాతావరణ ఎలక్ట్రో-ఆప్టికల్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్‌ను వీటికి ఉంటాయి.

మిషన్ సుదర్శన్ చక్రలో భాగంగా కొత్త ఆయుధాలు..
2035 నాటికి దేశ భద్రతా వ్యవస్థను బహుళ స్థాయిలకు, స్వదేశీగా మార్చే ప్రణాళిక అయిన మిషన్ సుదర్శన్ చక్రలో భాగంగా ఈ సేకరణ జరుగుతోందని సైన్యం పేర్కొంది. ఈ మిషన్ ద్వారా నిఘా, సైబర్, వాయు రక్షణ వ్యవస్థలను మరింత ఆధునీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సైన్యం తెలిపింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మిషన్‌ సుదర్శన్ చక్రను ప్రకటించారు. భారత సరిహద్దులను ఉల్లంఘిస్తే, ఆపరేషన్ సింధూర్ 2.0లో వెనక్కి తగ్గే ప్రసక్తి ఉండదని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్థాన్‌ను హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత, సైన్యం ఎలాంటి వైమానిక దాడికైనా సిద్ధంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే సైన్యం ఆయుధాలను సమకూర్చుకుంటూ ముందుకు వెళ్తుంది. తాజా AK-630 వంటి హై-ఫైరింగ్ తుపాకులు భవిష్యత్తులో భారతదేశ భద్రతకు రక్షణ కవచంగా మారుతాయని సైన్యాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

READ ALSO: 2025 Nobel Prize Physics: భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్ బహుమతి..

Exit mobile version