Indian 2 : దాదాపు 8 వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో శంకర్ భారీ ప్లాన్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వనటుడు కమల్ హాసన్ గత ఏడాది విక్రమ్ సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు.. విక్రమ్ సినిమా కమల్ హాసన్ కు అద్భుత విజయాన్ని అందించింది..ఇదే ఊపుతో కమల్ ఇండియన్ 2 సినిమాను లైన్ లో పెట్టాడు.కమల్ హాసన్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో.. వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇండియన్ (భారతీయుడు). ఇక ఇదే కాంబినేషన్ లో.. ఈ ఇద్దరు స్టార్లు కలిసి ఇప్పుడు ఇండియన్ సినిమా కు సీక్వెల్ ను చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశలో ఉంది. ఇండియన్ 2 గా తెరకెక్కుతోన్న.. ఈ సినిమా లో సిద్దార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని, వెన్నెల కిశోర్ మరియు బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల ఈమూవీ కొన్నాళ్లు ఆగిపోయింది. అయితే ఈ సినిమా కు వచ్చిన చిక్కులు తొలిగిపోయి మళ్ళీ షూటింగ్ మొదలయింది..
గత కొన్నాళ్లు గా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఇటీవల ఈ మూవీ డబ్బింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయని చెప్పడం తో షూటింగ్ చివరి దశకు వచ్చిందని అంతా అనుకున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ ని అయితే దర్శకుడు శంకర్ ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తెరకెక్కిస్తుండగా లేటెస్ట్ గా ఇండియన్ 2 టీమ్ ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కు చేరింది. ఇక్కడ ఓ క్రేజీ సీక్వెన్స్ ను తీయ్యబోతున్నట్టు తెలుస్తోంది. ఈ షూటింగ్ కోసం ఏకంగా 8000 వేల మంది జూనియర్ ఆర్టిస్ట్ లను తీసుకున్నట్టు సమాచారం. అక్కడ ఈ చిత్రంలో ఓ క్రేజీ సీక్వెన్స్ ని షూటింగ్ జరుపుకుంటున్నట్టుగా తెలుస్తుంది.విజయవాడ లోని గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తున్నారని సమాచారం.. దీనితో మొత్తం నాలుగు రోజులు అక్కడ బ్లాక్ చేసినట్టు గా తెలుస్తుంది.. శంకర్ తెరకెక్కించబోయే ఈ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలువనున్నట్లు సమాచారం.
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- Tags
- #kamalhasan
- Indian-2
- Shankar
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!