Site icon NTV Telugu

IND vs SA 3rd ODI: నయా రికార్డ్.. వరుసగా 20 సార్లు టాస్ ఓడి.. 21 సారి గెలిచిన భారత్

Ind Sa

Ind Sa

IND vs SA 3rd ODI: భారత్ VS దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో చివరి మ్యాచ్ ఈరోజు (డిసెంబర్ 6) విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ నయా రికార్డుకు స్వస్తి పలికింది. అనేక మ్యాచ్‌లో తరువాత భారత్ టాస్ గెలిచింది. ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియాకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తుండగా, టెంబా బావుమా దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా.. మ్యాచ్‌ 1:30కి ప్రారంభం కానుంది.

READ MORE: Bengal: వెనక్కి తగ్గని సస్పెన్షన్ ముస్లిం ఎమ్మెల్యే.. బాబ్రీ మసీదు శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు

ఈ వన్డే సిరీస్ ను ఎలాగైన గెలవాలని, ఈ సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలతో టీమిండియా ఉంది. ఇది ఇలా ఉంటే టాస్ విషయంలో భారత్ ఓ రికార్డును బ్రేక్ చేసింది. వరుసగా 20 వన్డే మ్యాచుల్లో టాస్ ఓడిన భారత్.. 21 సారి టాస్ గెలిచింది. 2023 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ నుంచి మొన్న జరిగిన సెకండ్ ఓడీఐ వరకు వన్డేలో టీమిండియా టాస్ లు ఓడిపోతూ వచ్చింది. 20 సార్లు టాస్ ఓడిన భారత్ తర్వాత రెండో స్థానంలో నెదర్లాండ్ ఉంది. ఈ జట్టు 11 వన్డే మ్యాచుల్లో టాస్ ఓడింది. 2011 మార్చి నుంచి 2013 ఆగష్టు మధ్య కాలంలో నెదర్లాండ్ జట్టు వరుసగా 11 సార్లు టాస్ ఓడింది. భారత్ వరుస టాస్ ఓటములు టీమిండియా క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి టాస్ ఓటముల్లో భారత్ టాప్ ప్లేస్ లో ఉంది.

READ MORE: Prabhas : డార్లింగ్‌కు జక్కన్న పంపిన స్పెషల్ లేఖ..వైరల్

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్ కోసం భారత్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక మార్పు చేసింది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో తిలక్ వర్మ జట్టులోకి దించింది. మరోవైపు దక్షిణాఫ్రికా రెండు మార్పులు చేసింది. గాయం కారణంగా నాండ్జ్ బర్గర్, టోనీ డి జోర్జీ అందుబాటులో లేరు. వారి స్థానంలో ఫాస్ట్ బౌలర్ ఓట్నియల్ బార్ట్‌మన్, బ్యాట్స్‌మన్ ర్యాన్ రికెల్టన్ జట్టులోకి వచ్చారు.

భారత ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్/కెప్టెన్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ మరియు ప్రసిద్ధ్ కృష్ణ.

దక్షిణాఫ్రికా జట్టు XI: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్, టెంబా బావుమా (కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రూవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, లుంగి ఎన్గిడి మరియు ఓట్నీల్ బార్ట్‌మన్.

Exit mobile version