Ind vs Pak Controversy: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలొకొన్నది. భారత బౌలర్ హర్షిత్ రాణాను పాకిస్థాన్ ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేయడంతో మైదానంలో హైడ్రామా నెలకొంది. దీనితో తన సహచర ఆటగాడిని అవమానించడాన్ని సహించని భారత కెప్టెన్ తిలక్ వర్మ.. పాకిస్థాన్ ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో పరిస్థితి చేయి దాటకుండా అంపైర్లు మధ్యలో జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకరావాల్సి వచ్చింది.
భారత ఇన్నింగ్స్‌లో 45వ ఓవర్ రెండో బంతికి ఈ ఘటన జరిగింది. మహమ్మద్ ఇమ్రాన్ రంధావా వేసిన ఫుల్‌టాస్ బంతికి హర్షిత్ రాణా ఔటయ్యాడు. అప్పటికే భారత్ ఓటమి అంచున ఉండగా.. పాకిస్థాన్ విజయానికి ఒక్క వికెట్ మాత్రమే అవసరమైంది. దీంతో హర్షిత్ రాణా పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో సూఫియాన్ ముకీమ్‌తో పాటు పాకిస్థాన్ ఆటగాళ్లు అతడిని స్లెడ్జింగ్ చేశారు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
మరో ఎండ్‌లో ఉన్న కెప్టెన్ తిలక్ వర్మ వెంటనే స్పందించాడు. పాకిస్థాన్ ఆటగాళ్ల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో మైదానంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అంపైర్లు రంగంలోకి దిగి ఇరు జట్ల ఆటగాళ్లను శాంతింపజేశారు. ఈ ఘటనలో ఆటగాళ్ల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగినట్లు కనిపించినప్పటికీ, అసభ్య పదజాలం ఉపయోగించారనే విషయంపై స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే, ఈ వివాదానికి మరో కారణం కూడా ఉంది. పాకిస్థాన్ బ్యాటర్లు క్రీజులో ఉన్న సమయంలో హర్షిత్ రాణా కూడా పలుమార్లు వారిని స్లెడ్జింగ్ చేసినట్లు తెలుస్తోంది. వికెట్లు తీసిన సందర్భాల్లోనూ పాకిస్థాన్ ఆటగాళ్లతో మాటల యుద్ధానికి దిగాడు. అప్పుడు కూడా అంపైర్లు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దీంతో హర్షిత్ ఔటైన తర్వాత పాకిస్థాన్ ఆటగాళ్లు అదే తరహాలో స్పందించినట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై మ్యాచ్ రిఫరీ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఏ జట్టు 49.2 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌట్ అయింది. హసన్ నవాజ్ (79), మాజ్ సదాఖత్ (59), ఫర్హాన్ యూసఫ్ (56) అర్ధసెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, సూర్యాన్ష్ షెడ్గే, విప్రజ్ నిగమ్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం 314 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.1 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయింది. అభిషేక్ శర్మ (70), తిలక్ వర్మ (100), షాబాజ్ అహ్మద్ (56) పోరాడినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. దీంతో పాకిస్థాన్ ఏ జట్టు 48 పరుగుల తేడాతో విజయం సాధించింది.
🚨 HEATED ARGUMENT BETWEEN TILAK VARMA AND PAKISTANI PLAYERS! 🤬🔥
The tension is reaching another level in this India vs Pakistan clash.
Players from both sides get involved in a fiery exchange as tempers continue to flare on the field! 😡💀 https://t.co/9RhDTQnGFi
— VARAHA WARRIOR (@VarahaWarrior) November 22, 2026

