India vs Australia 4th T20I Prediction: 5 టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగే నాలుగో టీ20లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. తొలి రెండు టీ20ల్లో భారత్ నెగ్గగా.. మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. సిరీస్ ఫలితం రాయ్‌పూర్‌లోనే తేలుతుందా? లేదా చివరి మ్యాచ్‌లో నిర్ణయమవుతుందా? అన్నది చూడాలి. నేటి రాత్రి 7 గంటల నుంచి స్పోర్ట్స్18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
భారత్ బ్యాటింగ్ బాగుంది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సూపర్ ఫామ్ పెద్ద సానుకూలాంశం. యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్‌లతో లైనప్ బలంగా ఉంది. ఇక చివరి రెండు మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి వచ్చాడు. దాంతో హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మపై వేటు పడే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో తిలక్ కూడా పెద్దగా రాణించలేదు. మొడటి రెండు టీ20లలో అతడు విఫలమయ్యాడు.
టీమిండియాకు బౌలింగే ఆందోళన కలిగిస్తోంది. యువ బౌలర్లు భారీగా పరుగులు ఇస్తున్నారు. సిరీస్ నెగ్గాలంటే ఆఖరి ఓవర్లలో బౌలింగ్ బాగా మెరుగుపడడం అత్యవసరం. మూడో టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు చివరి రెండు ఓవర్లలో ఏకంగా 40కి పైగా పరుగులను కాపాడలేకపోయారు. ప్రసిద్ధ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. మరోవైపు మరో వైపు మ్యాక్స్‌వెల్, స్మిత్, జంపా వంటి కీలక ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోయినా.. ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ కోసం ఆసీస్ తుది జట్టులో అనేక మార్పులు జరగనున్నాయి. రాయ్‌పూర్ పిచ్ సాధారణ బ్యాటింగ్ వికెట్ కాబట్టి.. మరోసారి భారీ స్కోర్లు ఖాయం. ఈ మ్యాచ్‌కు వర్షసూచన లేదు.
Also Read: JEE Mains: జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు!
తుది జట్లు (అంచనా)
భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), యశస్వి, రుతురాజ్, ఇషాన్, అయ్యర్, రింకూ, అక్షర్, బిష్ణోయ్, చహర్, అవేశ్, ముకేశ్.
ఆ్రస్టేలియా: వేడ్ (కెప్టెన్ ), హార్డీ, హెడ్, షార్ట్, మెక్‌డెర్మాట్, డేవిడ్, క్రిస్ గ్రీన్, డ్వార్‌షుయిస్, ఎలిస్, బెహ్రన్‌డార్ఫ్, సంఘా.