Site icon NTV Telugu

Hockey Asia Cup 2025: చరిత్ర సృష్టించిన భారత్.. చైనాను మట్టికరిపించి ఫైనల్స్‌కు..

India Vs China

India Vs China

Hockey Asia Cup 2025: బిహార్‌లోని రాజ్ గిర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న హాకీ ఆసియా కప్‌లో భారత జట్టు సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో దుమ్మురేపిన టీమిండియా.. సూపర్‌ 4 మ్యాచ్‌లోనూ అదే జోరు చూపించి చైనాకు చెక్ పెట్టింది. శనివారం జరిగిన ఏకపక్ష పోరులో ప్రత్యర్థిని 7-0 తేడాతో చిత్తుగా ఓడించి హర్మన్‌ప్రీత్ సింగ్ సేన దర్జాగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఇప్పుడు నాలుగో ఆసియా కప్ టైటిల్ కోసం దక్షిణకొరియాతో భారత్ తలపడనుంది.

READ ALSO: Kakinada : వంగవీటి రంగ విగ్రహ వివాదంపై కాకినాడ కలెక్టర్‌తో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

భారత జట్టు జైత్రయాత్ర..
ఆసియా కప్‌లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచుల్లో స్వల్ప తేడాతో విజయం సాధించిన టీమిండియా సూపర్‌ 4లో మాత్రం ఓ రేంజ్‌లో చెలరేగింది. మలేషియాపై గోల్స్ వర్షం కురిపించి 17-0తో జయభేరి మోగించింది. శనివారం హర్మన్‌ప్రీత్ సేన చైనాను కూడా చిత్తుచిత్తుగా ఓడించింది. అన్ని విభాగాల్లోనూ సమిష్టిగా రాణించిన భారత జట్టు.. ప్రత్యర్థి డిఫెన్స్‌ను కకావికలం చేసి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది.

తొలి అర్థ భాగంలోనే శిలానంద్ లక్రా, దిల్‌ప్రీత్ సింగ్, మన్‌దీప్ సింగ్ తలా ఒక గోల్ చేయడంతో 3-0తో ఆధిక్యం సాధించింది. రెండో అర్ధ భాగంలో రాజ్‌కుమార్ పాల్, సుఖ్‌జీత్ సింగ్ చెరొక గోల్ చేసి చైనాపై ఒత్తిడి పెంచారు. దాంతో.. ప్రత్యర్థి జట్టు సభ్యులు గోల్ చేసేందుకు సర్వశక్తులు ఒడ్డారు. కానీ.. ఆఖర్లో అభిషేక్ నైన్ రెండు గోల్స్‌ కొట్టి భారత్ ఆధిక్యాన్ని 7-0కు పెంచాడు. దాంతో.. హర్మన్‌ప్రీత్ సేన నాలుగో టైటిల్ వేటకు సిద్ధమైంది.

ఈ టోర్నమెంట్లో హర్మన్ ప్రీత్ సింగ్ కెప్టెన్సీలోని భారత జట్టు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అంతకుముందు గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ భారత్ గెలిచింది. మొదట చైనాను 4-3 తేడాతో ఓడించింది. తర్వాత జపాన్‌ను 3-2 తేడాతో, కజకిస్థాన్‌పై 15-0 తేడాతో భారీ విజయాలను నమోదు చేసింది. ఇప్పుడు టైటిల్ కోసం 5 సార్లు ఛాంపియన్ అయిన దక్షిణ కొరియాతో తలపడనుంది.

READ ALSO: Operation Gibraltar: సెప్టెంబర్ 6, 1965లో కాశ్మీర్‌లో ఏమైంది.. ఆపరేషన్ జిబ్రాల్టర్‌తో పాక్‌‌కు ఏంటి సంబంధం?

Exit mobile version