India-USA: భారత్‌పై అమెరికా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య నియమాలు కూడా మారుతున్నాయి. తాజాగా భారత ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 25 నుంచి భారత్ అమెరికాకు పోస్టల్ సేవలను నిలిపివేయనుంది. జూలై 30, 2025న అమెరికా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. జులై 30న అమెరికా యంత్రాంగం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం.. 800 డాలర్ల విలువైన వస్తువులపై ఉన్న పన్ను మినహాయింపులను ఉపసంహరించుకుంది. ఫలితంగా అమెరికాకు వెళ్లే అన్ని పోస్టల్ సర్వీసులకు వాటి విలువతో సంబంధం లేకుండా సుంకాలకు లోబడి ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాజా ప్రకటన వచ్చింది. 100 డాలర్ల విలువైన గిఫ్ట్ ఐటెమ్స్, లేఖలు, దస్త్రాలకు మాత్రం సుంకాల నుంచి మినహాయింపు కొనసాగుతోంది.
READ MORE: KA Paul : సహస్ర కేసులో ఓ చట్టాన్ని తీసుకురావాలి
మరోవైపు… భారత్ నుంచి దిగుమతి అవుతున్న ఉత్పత్తులపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ భారం మోయక తప్పలే కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ట్రేడ్ డీల్ కుదిరితే తప్పా అదనపు సుంకాల భారం నుంచి ఉపశమనం లభించదంటున్నారు. వాణిజ్య ఒప్పందంపై ఎలాంటి స్పష్టత రాకపోవడంో ఆగస్టు 7వ తేదీ నుంచి 25 శాతం సుంకాలు అమలులోకి రాగా ఆగస్టు 27వ తేదీ నుంచి మరో 25 శాతం టారిఫ్ అమలు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
6వ విడత వాణిజ్య చర్చలు చేపట్టేందుకు అమెరికా టీం ఈనెల 25న భారత్‌కు వస్తోంది. ఆ తర్వాత రెండ్రోజులకే అదనపు సుంకాలు (25 శాతం) అమలు లోకి రానుంది. అయితే ఈ రెండ్రోజుల్లో ఏదైనా మధ్యంతర ఒప్పందం కుదిరితే తప్పా ఆ సుంకాల భారం తప్పదు. రెండు రోజుల్లో ఒప్పందం కుదురుతుందని చెప్పలేమని, ఆశలు సన్నగిల్లుతున్నాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో 50 శాతం భారం మోయాల్సి రావచ్చని చెబుతున్నారు.
READ MORE: Botsa Satyanarayana : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేకరణను అడ్డుకుంటామన్న కూటమి నేతలు ఎటు పోయారు
