భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా బుధవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో 4వ T20 మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, దట్టమైన పొగమంచు టాస్ ను అడ్డుకుంది. అంపైర్లు చివరికి మ్యాచ్ రద్దు చేశారు. సిరీస్‌లోని చివరి మ్యాచ్ డిసెంబర్ 19న అహ్మదాబాద్‌లో జరుగనుంది. సాయంత్రం 6:30 గంటలకు టాస్ వేయాలని నిర్ణయించారు, కానీ దట్టమైన పొగమంచు కారణంగా టాస్ ఆలస్యం అయ్యింది.
Also Read:Palanadu Accident Case: ఐదుగురి మృతి కేసులో కీలక మలుపు.. నిందితులకు పోలీసుల కస్టడీ
ఆ తర్వాత రాత్రి 9:30 గంటలకు మ్యాచ్‌ను తిరిగి షెడ్యూల్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ పొగమంచు పెరుగుతూనే ఉంది. మ్యాచ్‌ను తిరిగి ప్రారంభించడానికి అంపైర్లు ఆరుసార్లు మైదానంలోకి వచ్చారు. రాజీవ్ శుక్లా కూడా వచ్చారు. కానీ, పరిస్థితులు అనుకూలించక మ్యాచ్ ప్రారంభం కాలేదు. మ్యాచ్ కోసం వచ్చిన క్రికెట్ ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. కాగా టీమ్ ఇండియా సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉంది. అహ్మదాబాద్‌లో జరగనున్న మ్యాచ్ సిరీస్‌కు కీలకం కానుంది.
