Mission Sudarshan Chakra: ఆపరేషన్ సింధూర్ విజయంతో భారతదేశం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండియా పాకిస్థాన్‌లోని ఉగ్రశిబిరాలను లక్ష్యంగా చేసుకొని కచ్చితత్వంతో దాడులు చేసింది. తర్వాత పాక్ కయ్యానికి కాలు దూకినా ధైర్యంగా ఎదురునిలిచి, దాయాది అహాన్ని అనిచింది. దెబ్బకు కాళ్లబేరానికి వచ్చిన పాక్ కాల్పుల విరమణ కోరడంతో బతికి బయటపడింది. అప్పటి నుంచి భారత్ రక్షణ రంగానికి సంబంధించి నిరంతర చర్యలు తీసుకుంటోంది. ఎప్పుడు ఎటు నుంచి ముప్పు ఎదుర్కోవాల్సి వచ్చిన సంసిద్ధంగా ఉండేలా రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ఈక్రమంలో దేశ రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. మిషన్ సుదర్శన్ చక్రలో భాగంగా దేశానికి అన్ని వైపుల నుంచి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు. దీని కోసం DRDO 2026 నుంచి బాలిస్టిక్ ఇంటర్‌సెప్టర్ క్షిపణులను పరీక్షించడం ప్రారంభిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది శత్రు విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్‌లను గాలిలోనే నాశనం చేస్తుందని సమాచారం.
READ ALSO: Prakasam Barrage : 69 గేట్లను 6 అడుగుల వరకు ఎత్తివేత
2030 నాటికి సైన్యంలోకి ప్రాజెక్ట్ కుషా..
ఈ ప్రతిష్టాత్మక ప్రణాళికకు DRDO ప్రాజెక్ట్ కుషా అని పేరు పెట్టింది. ఇందులో భాగంగా DRDO శాస్త్రవేత్తలు మూడు కొత్త LR-SAM ఇంటర్‌సెప్టర్ క్షిపణులను అభివృద్ధి చేస్తున్నారు. అవి M-1, M-2, M-3. M-1 క్షిపణి మొదటి పరీక్ష 2026లో జరుగుతుంది. ఇది 150 కిలోమీటర్ల వరకు శత్రు విమానాలు, డ్రోన్‌లు, క్రూయిజ్ క్షిపణులను కూల్చివేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. M-2 క్షిపణి 2027లో పరీక్షించనున్నారు. ఇది గాలిలో 250 కిలోమీటర్ల వరకు ఉన్న క్షిపణులను నాశనం చేయగలదు. M-3 క్షిపణి ముఖ్యంగా ఇది శత్రు క్షిపణులను, డ్రోన్‌లను 350 కిలోమీటర్ల దూరం వరకు కచ్చితంగా లక్ష్యంగా చేసుకుని నాశనం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 2028 లోపు ఈ మూడు క్షిపణులను సిద్ధం చేసి 2030 నాటికి సైన్యానికి అందజేయడమే తమ లక్ష్యమని DRDO శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్షిపణులు రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 రక్షణ వ్యవస్థను పోలి ఉంటాయి, కానీ వీటిని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇటీవల CDS జనరల్ అనిల్ చౌహాన్ మాట్లాడుతూ.. భారతదేశం తన సొంత ఖర్చుతో ఐరన్ డోమ్ లేదా గోల్డెన్ డోమ్ వంటి భద్రతా కవచాన్ని అభివృద్ధి చేసుకోగలదని అన్నారు. ఈ కవచం దాడుల నుంచి రక్షించడమే కాకుండా శత్రు లక్ష్యాలకు కూడా ప్రతిస్పందిస్తుంది. భారతదేశం ఇప్పటికే ప్రలే, బ్రహ్మోస్, క్రూయిజ్ క్షిపణుల వంటి ఆయుధాలను కలిగి ఉందని ఆయన అన్నారు.
బహుళ వ్యవస్థలు అనుసంధానించబడతాయి
ఐరన్ డోమ్ లేదా గోల్డెన్ డోమ్ రక్షణ కవచాన్ని సృష్టించడానికి భూమి, గాలి, సముద్రం, అంతరిక్షంలో విస్తరించి ఉన్న సెన్సార్ల నెట్‌వర్క్ కావాలి. దీనిలో శత్రు దాడులను గుర్తించడానికి, వాటిని నిరోధించడానికి, అలాగే నాశనం చేయడానికి అనేక సాంకేతికతలను ఉపయోగిస్తారు. ఇటీవల DRDO QRSAMS (30 కి.మీ పరిధి), VSHORADS (6 కి.మీ పరిధి) 30-కిలోవాట్ లేజర్ ఆయుధాలను కలిగి ఉన్న IADWS (ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్)ను విజయవంతంగా పరీక్షించింది. మిషన్ సుదర్శన్ చక్ర భద్రతా కవచంలో బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ కూడా ఉంటుంది. భారతదేశం ఇప్పటికే గాల్లోకి 2000 కి.మీ. వరకు ఉన్న క్షిపణులను కాల్చివేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. తాజాగా నిర్వహించిన పరీక్షలతో 5000 కి.మీ. వరకు ఉన్న క్షిపణుల నుంచి భారత్ తనను తాను రక్షించుకోగలదని నిరూపించాయి. ఈ క్షిపణి రక్షణ కవచం అమెరికా గోల్డెన్ డోమ్, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ లాగా ఉంటుంది. 2035 నాటికి దేశంలోని ముఖ్యమైన ప్రదేశాలను ఈ భద్రతా కవచంతో రక్షించనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ కొత్త క్షిపణి రక్షణ కవచం రాబోయే సంవత్సరాల్లో చైనా, పాకిస్థాన్‌లకు అతిపెద్ద తలనొప్పిగా మారడం కాయం.
READ ALSO: Ranu Bombaiki Ranu Song : ’రాను బొంబాయికి రాను’ పాటకు ఎన్ని కోట్లు వచ్చాయో చెప్పిన లిఖిత..
