India Turns Global Heat Centre: సూరీడి ప్రతాపం భారత్‌పై అధికంగా ఉంది. సూర్య భగవానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఒక ఎత్తు అయితే, భారత్‌లో మరో ఎత్తు అన్నట్లుగా భానుడు భగభగలాడిపోతున్నాడు. ఏప్రిల్ 21 మధ్యాహ్నం 12:21 గంటల సమయానికి AQI.in విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా నమోదైన 20 అత్యంత ఉష్ణోగ్రత ప్రాంతాలలో 19 ఒక్క భారతదేశంలోనే ఉండటం గమనార్హం. అంటే ప్రపంచ వేడికి ఇప్పుడు మన దేశమే ప్రధాన కేంద్రంగా మారింది. భారతదేశం ప్రపంచవ్యాప్త ఉష్ణోగ్రతల పెరుగుదలకు కేంద్ర బిందువుగా ఉంది. ఇక, టాప్-20 జాబితాలో భారత్ వెలుపల ఉన్న ఏకైక ప్రాంతం నేపాల్‌లోని లుంబినీ మాత్రమే. అంతేకాదు.. ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 24 వరకు వడగాలుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని, ఈ కాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరిగి 43 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం తెలిపింది.
READ MORE: Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
ప్రపంచంలో అత్యంత వేడి నగరాల జాబితాలో బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్‌లోని నగరాలు ఆధిపత్యం వహిస్తున్నాయి. ఇక్కడ ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి పెరిగాయి. పలు ప్రదేశాలలో 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. బీహార్‌లోని భాగల్పూర్, ఒడిశాలోని తాల్చేర్, పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి. ఒక్కో చోట 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక బీహార్‌లోని బెగుసరాయ్, మోతిహారి, ముంగేర్, భోజ్‌పూర్, సివాన్ వంటి పలు నగరాలతో పాటు పశ్చిమ బెంగాల్, తూర్పు ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను నమోదయ్యాయి.
READ MORE: Jasprit Bumrah IPL Record: 276 టీ20 మ్యాచ్‌ల నిరీక్షణకు తెర.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
ఉష్ణోగ్రతలు ఇంతలా పెరగడానికి కారణాలు:
మేఘాలు లేని నిర్మలమైన ఆకాశం వల్ల సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. ఏప్రిల్ నెల సాధారణంగానే వేడిగా ఉన్నప్పటికీ, ఈసారి భూ ఉపరితలం అత్యంత వేగంగా వేడెక్కుతోంది. యూరేషియా, హిమాలయ ప్రాంతాల్లో శీతాకాలంలో మంచు తక్కువగా కురవడం మరో కారణం. మంచు తక్కువగా ఉండటం వల్ల సూర్యరశ్మి తిరిగి అంతరిక్షంలోకి పరావర్తనం చెందక, భూమిలో వేడి పేరుకుపోతోంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం, వాతావరణ ప్రసరణలో మార్పుల వల్ల చల్లని గాలులు వీచే వ్యవస్థ బలహీనపడింది. వాయువ్య దిశ నుంచి వీస్తున్న పొడి గాలుల వల్ల మేఘాలు ఏర్పడటం తగ్గిపోయింది. ఫలితంగా వర్షాలు కురిసే అవకాశం లేకుండా పోయి వేడి గాలులు (Heatwaves) తీవ్రమయ్యాయి.
