INDIA bloc decides to boycott 14 News Anchor’s Shows: నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి గురువారం షాకింగ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, బీజేపీకి మద్దతుగా వ్యవహరిస్తున్న మీడియా ఛానెళ్లను, కొంతమంది యాంకర్లను బహిష్కరించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. బాయ్‌కాట్ చేయబోయే యాంకర్లు, షోల జాబితాను విపక్ష నేతలు రెడీ చేసుకున్నారు. అందుకు సంబంధించిన పేర్లను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్, మీడియా అండ్ పబ్లిసిటీ చైర్మన్ పవన్ ఖేరా ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ఇండియా సమన్వయ కమిటీ నిర్ణయించిన విధంగా కూటమిలో ఉన్న పార్టీలు ఏవి కూడా తమ నేతలకు ఈ కింద పేర్కొ్న్న వ్యక్తుల ఇంటర్వ్యూలకు షోలకు అనుమతించకూడదు అని పేర్కొంటూ ఆ లిస్ట్ ను రిలీజ్ చేశారు.
Also Read: Mobile Alert: ఫోన్ తీసుకొని టాయిలెట్లోకి వెళ్తున్నారా.. ఆ తప్పు మిమ్మల్ని నపుంసకుడిని చేస్తుంది
అందులో రిపబ్లిక్ నెట్‌వర్క్‌కు చెందిన అర్నాబ్ గోస్వామి, ఆజ్ తక్‌కు చెందిన సుధీర్ చౌదరి, న్యూస్18 హిందీకి చెందిన అమీష్ దేవగన్, టైమ్స్‌నౌ యొక్క నావికా కుమార్, ఇండియాటుడే గ్రూప్‌కు చెందిన గౌరవ్ సావంత్ తో పాటు అదితి త్యాగి, అమన్ చోప్రా, ఆనంద్ నరసింహన్, అశోక్ శ్రీవాస్తవ, చిత్రా త్రిపాఠి, గౌరవ్ సావంత్, ప్రాచీ పరాశర్, రూబిక్స్ లియాఖత్, శివ్ అరోర్ మొత్తం 14 మంది న్యూస్ యాంకర్లు ఉన్నారు. బీజేపీకి వత్తాసు పలుకుతూ రాహుల్ గాంధీ జోడో యాత్ర గురించి కొన్ని ఛానళ్లు ప్రసారం చేయడం లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ కారణంగానే ఒక నెల పాటు టీవీ చర్చలకు తమ అధికార ప్రతినిధులను పంపకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది. అన్ని మీడియా ఛానెల్‌లు తమ షోలలో కాంగ్రెస్ ప్రతినిధులను ఉంచవద్దని అభ్యర్థిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రణదీప్ సూర్జేవాలా ట్విట్టర్‌లో(ఎక్స్) ఓ ట్వీట్ పెట్టారు. ఇక గతంలో అనగా 2019లో కూడా ఒక నెల పాటు టెలివిజన్ షోలను నిషేధించింది కాంగ్రెస్.
