Site icon NTV Telugu

I.N.D.I.A: ఈసీని కలవనున్న ఇండియా కూటమి..ఎందుకంటే?

New Project (14)

New Project (14)

లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత.. ఇండియా కూటమిలో కలకలం రేగింది. అన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా మారాయి. దీంతో ఇండియా కూటమికి చెందిన ప్రతినిధి బృందం ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు నిర్వాచన్ సదన్‌కు వెళ్లి ఎన్నికల కమిషన్‌ను కలవనుంది. కూటమి తమ 3 ప్రధాన డిమాండ్లను కమిషన్ ముందు ఉంచనుంది. ‘మొదటిది.. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం.. VVPAT లో స్లిప్‌లను సరిపోల్చాలి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టాలి. ప్రతి రౌండ్ తర్వాత అభ్యర్థులకు డేటా వెల్లడించాలి. ఆ రౌండ్ లో ఎలాంటి అవకతవకలు లేవని అందరూ తేల్చిన తర్వాతే మరో రౌండ్ లెక్కింపు ప్రారంభించాలి.’ ఈ డిమాండ్లను ఈసీ ముందుంచనుంది.

Read more: Sajjala Ramakrishna Reddy : వైసీపీ మంచి మెజారిటీతో గెలుస్తుంది

కాగా తాజాగా ఎగ్జిట్ పోల్స్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఎగ్జిట్ పోల్‌ను ఆయన పూర్తిగా తిరస్కరించారు. ఇది ఎగ్జిట్ పోల్ కాదని, మోడీ మీడియా పోల్ అని రాహుల్ గాంధీ అన్నారు. ఇది వారి ఫాంటసీ పోల్ అని ఆరోపించారు. చాలా స్థానాల్లో పోటీ ఎక్కువగా ఉందని, ఫలితాలు వచ్చాక అంతా తేలిపోతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత కూటమికి 295 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్న ప్రశ్నకు రాహుల్ గాంధీ ‘సిద్ధూ మూసేవాలా పాటను గుర్తు చేశారు. ఈ పాట మీరు విని అప్పుడు అర్థం చేసుకోవాలని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్‌ను ‘నకిలీ’గా పేర్కొంటూ.. ఇది ఎన్నికల రిగ్గింగ్‌ను సమర్థించే ‘ఉద్దేశపూర్వక ప్రయత్నమని’, భారత కూటమి కార్యకర్తలను నిరుత్సాహపరిచేందుకు ప్రధాని మోడీ ఆడుతున్న ‘సైకలాజికల్ గేమ్’ అని కాంగ్రెస్ అభిప్రాయపడింది.

Exit mobile version