Site icon NTV Telugu

Indecent Behavior: బైక్ బుక్ చేసుకున్న మహిళపై అసభ్యకర ప్రవర్తన.. ఎక్కడో తెలుసా..!

Biker

Biker

ఆఫీసుకు వెళ్లాలన్న, లేదంటే వేరే చోటుకి వెళ్లాలన్న నేరుగా బైక్ గానీ, ఆటోగానీ మన దగ్గరకే వస్తాయి. బస్సుల్లో వెళ్లాల్సిన అవసరం లేకుండా.. టైమ్ కు తమ గమ్యస్థానానికి వెళ్లాలని బైక్ లు, ఆటోలు బుక్ చేసుకుంటున్నారు. బుక్ చేసుకునే వారిలో అమ్మాయిలు కూడా ఉంటున్నారు. అయితే తాజాగా ఓ కంపెనీకి చెందిన బైక్‌ను బుక్‌ చేసుకున్న మహిళకు చేదు అనుభవం ఎదురైంది. సదరు బైకర్‌ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అంతే కాకుండా ఆ మహిళకు వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు పంపించాడు. దీంతో బాధితురాలు కంగుతిన్నది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. అయితే తనకు జరిగిన ఈ చేదు అనుభవాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది.

Sagileti Katha: నవదీప్ సమర్పణలో ‘సగిలేటి కథ’.. ఆరోజే ట్రైలర్ రిలీజ్

బెంగళూరులో ఓ మీటింగ్ లో పాల్గొన్నాక.. ఇంటికి వెళ్దామని ఓ కంపెనీకి చెందిన బైక్‌ను బుక్‌ చేసుకున్నట్లు బాధిత మహిళ తెలిపింది. అయితే.. ఆ రైడర్‌ యాప్‌లో ఉన్న బైక్‌ నంబర్‌తో కాకుండా మరో బైక్‌లో పికప్‌ చేసుకునేందుకు లొకేషన్‌కు వచ్చాడు. ఆమెను రిసీవ్‌ చేసుకుని ఇంటికి వెళ్తుండగా.. రోడ్డుపై ఎవరూ లేని చోట ఒక చేతితో బైక్‌ నడుపుతూ మరో చేతితో అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఆ మహిళ చెప్పుకొచ్చింది. సదరు రైడర్ అలా ప్రవర్తించడంతో భయపడిపోయినట్లు ఆమె తెలిపింది.

Kishan Reddy: బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులతో కిషన్ రెడ్డి సమావేశం

అంతేకాకుండా.. బుక్ చేసుకున్న లొకేషన్ వరకు తీసుకురాకుండా.. ఇంటికి 200 మీటర్ల దూరంలో తనను దింపినట్లు ఆ మహిళ చెప్పింది. అంతేకాకుండా సదరు బైకర్‌ మహిళ ఫోన్‌ నంబర్‌ సేవ్‌ చేసుకుని తనకు మెసేజ్‌లు చేయడం స్టార్ట్‌ చేశాడు. అంతేకాకుండా వాట్సాప్‌లో అసభ్యకరంగా మెసేజ్‌లు పెట్టడంతో నంబర్‌ బ్లాక్‌ చేసినట్టు చెప్పుకొచ్చింది. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన సదరు వాహనాల బుకింగ్‌ సంస్థపై ఆ మహిళ మండిపడ్డారు. బైకర్ల విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. మీ సంస్థ వినియోగదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. దయచేసి ప్రయాణికుల సురక్షితమైన ప్రయాణ అనుభవం ప్రయత్నించండి అని చెప్పింది. అంతేకాకుండా అతను నుంచి ఇప్పటికీ వివిధ నంబర్‌ల నుండి కాల్స్ వస్తున్నాయని బాధిత మహిళ తెలిపింది.

Exit mobile version