ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన పాక్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. బాబర్, ఇమాన్ ఔటయ్యారు. టీమ్ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో పాక్ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. కాగా.. భారత్ వన్డే ఫార్మాట్‌లో వరుసగా టాస్‌లు ఓడిపోవడం ఇది 12వ సారి. అంతకుముందు నెదర్లాండ్స్ జట్టు వరుసగా 11 మ్యాచ్‌ల్లో టాస్ కోల్పోయింది. మార్చి 2011 నుంచి ఆగస్టు 2013 వరకు ఇది కొనసాగింది.