ఛాంపియన్స్ ట్రోఫీలో రసవత్తర సమరానికి సమయం అసన్నమైంది. అన్ని లీగ్ మ్యాచ్‌ల్లోనూ నెగ్గి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత్.. ఈరోజు జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడబోతుంది. ట్రోఫీని దక్కించుకునేందుకు రోహిత్ సేనకు ఇదో మంచి అవకాశం అని చెప్పాలి. అయితే, న్యూజిలాండ్ కూడా చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. ఆ టీమ్ ను ఓడించాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే. మ్యాచ్ ప్రారంభానికి ముందు మేఘాలు కమ్ముకున్నాయి. కానీ ప్రస్తుతానికి వర్షం పడే అవకాశం లేదు.
Read Also: Pawan Kalyan : లుక్స్, ఫిజిక్ పై వర్కవుట్స్ మొదలు పెట్టిన పవర్ స్టార్..?
వర్షం ఆటంకం కలిగిస్తే..?:
2002లో వర్షం కారణంగా మ్యాచ్ రోజు, రిజర్వ్ డే కూడా వర్షం పడటంతో.. భారత్, శ్రీలంక ట్రోఫీని కలిసి పంచుకున్నాయి. అయితే.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు సోమవారం (మార్చి 10న) రిజర్వ్ డే ఉంది.
ఫైనల్ ఫలితం కోసం కనీసం 25 ఓవర్లు అవసరం:
ఫైనల్ మ్యాచ్ ఫలితం రావాలంటే జట్లు కనీసం 25 ఓవర్లు ఆడాలి. ఆదివారం వర్షం ఆటకు అంతరాయం కలిగిస్తే సోమవారం అదే మ్యాచ్ తిరిగి ప్రారంభమవుతుంది. వర్షం కారణంగా ఈరోజు, రిజర్వ్ డే రెండూ ఆడకుండా ఉంటే.. ఇండియా, న్యూజిలాండ్ జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు. “షెడ్యూల్ చేసిన రోజున ఆటకు అంతరాయం కలిగితే అంపైర్లు అందుబాటులో ఉన్న అదనపు సమయాన్ని ఉపయోగించుకోవాలి. అవసరమైతే ఆ రోజున ఫలితం రావడానికి ఓవర్ల సంఖ్యను తగ్గించాలి” అని ఐసీసీ ఆట నిబంధనలను పేర్కొంది.
“స్టేడియం, లైటింగ్, వెదర్ విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు రిజర్వ్ డే అందుబాటులో లేనట్లుగా.. ఆ రోజున ఫలితాన్ని సాధించడానికి అంపైర్లు మ్యాచ్ షెడ్యూల్ చేయబడిన రోజున ఆటను ముగించడం లక్ష్యంగా పెట్టుకోవాలి.” ఐసీసీ తెలిపింది. “ప్రతి జట్టుకు ఫలితం సాధించాలంటే కనీసం 25 ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం ఉండాలి. షెడ్యూల్ చేసిన రోజున ఫలితం సాధించడానికి కనీస ఓవర్ల సంఖ్యను బౌల్ చేయడానికి అవసరమైన కటాఫ్ సమయానికి ఆట తిరిగి ప్రారంభించబడకపోతే, ఆ రోజు ఆటను రద్దు చేస్తారు. మ్యాచ్‌ను పూర్తి చేయడానికి లేదా తిరిగి ఆడటానికి రిజర్వ్ డేను ఉపయోగిస్తారు. అసంపూర్ణ మ్యాచ్‌ను కొనసాగించడానికి రిజర్వ్ డేను ఉపయోగిస్తారు.” అని ఐసీసీ పేర్కొంది.