NTV Telugu Site icon

IND vs ENG: రవిచంద్రన్ అశ్విన్ మ్యాజికల్ డెలివరీ.. బిత్తరపోయిన బెన్ స్టోక్స్!

Ravichandran Ashwin Test

Ravichandran Ashwin Test

R Ashwin’s brilliant delivery to dismiss Ben Stokes: టీమిండియా వెటరన్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫ్ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతుంటాడు. ఆఫ్ స్పిన్, క్యారమ్ బాల్స్ మాత్రమే కాదు నకుల్ బాల్స్‌తో కూడా స్టార్ ఆటగాళ్లను సైతం సునాయాసంగా ఔట్ చేస్తుంటాడు. ఇక పిచ్ స్పిన్‌కు కాస్త అనుకూలించినా.. అశ్విన్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదు. మ్యాజికల్ డెలివరీలతో స్టార్ బ్యాటర్లు సైతం ఊహించని రీతిలో ఔట్ పెవిలియన్ చేర్చుతుంటాడు. తాజాగా అదే మరోసారి జరిగింది.

హైదరాబాద్‌లో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను రవిచంద్రన్ అశ్విన్ అద్భుత బంతితో వెనక్కి పంపాడు. జానీ బెయిర్‌స్టో అవుట్ అనంతరం స్టోక్స్‌ క్రీజులోకి వచ్చాడు. వికెట్స్ పడడంతో క్రీజులో ఉండాల్సిన అవసరం ఉన్నందున స్టోక్స్ జాగ్రత్తగా ఆడుతున్నాడు. పూర్తిగా డిఫెన్స్ చేస్తూ వికెట్ కాపాడుకుంటున్నాడు. 37వ ఓవర్ ఐదవ బంతిని రౌండ్ ది వికెట్ నుంచి ఆఫ్ స్పిన్ వేశాడు. బంతి బ్యాట్ ముందు పడి ఊహించని రీతిలో స్పిన్ అయి ఆఫ్-స్టంప్‌ను గిరాటేసింది. దాంతో స్టోక్స్‌ బిత్తరపోయాడు. అసహనంలో పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. ఇందుకుసంబంధించిన వీడియో వైరల్ అయింది.

Also Read: IND vs ENG: రవీంద్ర జడేజా ఖాతాలో అరుదైన రికార్డు!

మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 420 పరుగులకు ఆలౌటైంది. మార్క్ వుడ్‌ను ఆర్ జడేజా ఔట్ చేయడంతో ఇంగ్లీష్ జట్టు 9వ వికెట్ కోల్పోయింది. ఒలీ పోప్‌ 196 పరుగుల వద్ద ఔటై డబుల్‌ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్‌ (47), బెన్‌ ఫోక్స్‌ (34), హార్ట్‌లీ 34, జాక్ క్రాలీ (31) పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 4, అశ్విన్‌ 3, జడేజా 2 వికెట్స్ పడగొట్టారు. భారత్‌ లక్ష్యం 231 పరుగులుగా ఉంది.

Show comments