NTV Telugu Site icon

R Ashwin: కెరీర్‌లో వందో టెస్ట్‌.. చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్న అశ్విన్‌!

Ashwin

Ashwin

R Ashwin became India’s third cricketer to score a duck in his 100th Test: ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్ట్‌ మ్యాచ్‌ టీమిండియా వెటరన్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు కెరీర్‌లో వందో టెస్ట్‌ అన్న విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన యాష్‌.. బ్యాటింగ్‌లో మాత్రం నిరాశపరిచాడు. 5 బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. దాంతో చిరస్మరణీయ టెస్టులో అశ్విన్‌ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. వందో టెస్ట్‌లో డకౌటైన మూడో భారత క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచాడు.

వందో టెస్ట్‌లో డకౌటైన తొలి భారత క్రికెటర్‌గా దిలీప్‌ వెంగసర్కార్‌ (1988) ఉన్నాడు. ఈ జాబితాలో చతేశ్వర్‌ పుజారా (2023) రెండో స్థానంలో ఉండగా.. రవిచంద్రన్‌ అశ్విన్‌ (2024) మూడో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా వందో టెస్ట్‌లో డకౌటైన తొమ్మిదో ఆటగాడిగా యాష్ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. వందో టెస్ట్‌లో డకౌటైన తొలి ఆటగాడు వెంగసర్కార్‌ కావడం విశేషం. అలెన్‌ బోర్డర్‌ (1991), కోట్నీ వాల్ష్‌ (1998), మార్క్‌ టేలర్‌ (1998), స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ (2006), బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (2016), అలిస్టర్‌ కుక్‌ (2019), చతేశ్వర్‌ పుజారా (2023) తమ వందో టెస్ట్‌లో డకౌట్ అయ్యారు.

Also Read: Australia: అస్ట్రేలియాలో విషాదం.. ట్రెక్కింగ్‌కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి!

ఇక ఐదో టెస్ట్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ పటిష్ట స్థితిలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. దాంతో 255 పరుగుల ఆధిక్యంలో రోహిత్ సేన కొనసాగుతుంది. కుల్దీప్‌ యాదవ్‌ (27), జస్ప్రీత్‌ బుమ్రా (19) క్రీజ్‌లో ఉన్నారు. రోహిత్‌ శర్మ (103), శుభ్‌మన్‌ గిల్‌ (110) సెంచరీలు చేయగా.. యశస్వి జైస్వాల్‌ (57), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (65), సర్ఫరాజ్‌ ఖాన్‌ (56) హాఫ్ సెంచరీలు చేశారు.

 

 

Show comments