NTV Telugu Site icon

Akash Deep: ఆకాష్‌ దీప్‌ను వెంటాడిన దురదృష్టం.. క్లీన్‌ బౌల్డ్‌ చేసినా దక్కని వికెట్! వీడియో వైరల్

Akash Deep No Ball

Akash Deep No Ball

Akash Deep misses out dream debut wicket in Ranchi: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా రాంచి వేదికగా ఇంగ్లండ్‌తో నేడు ఆరంభమైన నాలుగో టెస్టులో పేసర్‌ ఆకాష్‌ దీప్‌ భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఆకాశ్ తుది జట్టులోకి వచ్చాడు. ఆకాశ్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్బుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. తన పేస్‌ బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ బ్యాటర్లను ముప్పుతిప్పులు పెడుతున్నాడు. అయితే తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే ఆకాష్‌ను దురదృష్టం వెంటాడింది. ఇంగ్లండ్ ఓపెనర్ జాక్‌ క్రాలేను క్లీన్‌ బౌల్డ్‌ చేసినా.. అతడి ఖాతాలో తొలి అంతర్జాతీయ వికెట్‌ పడలేదు.

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 4 ఓవర్‌ ఐదవ బంతిని ఆకాష్‌ దీప్‌ వేయగా.. జాక్‌ క్రాలే ఎదుర్కొన్నాడు. ఇన్‌ స్వింగర్‌గా దూసుకొచ్చిన ఆ బంతికి క్రాలే దగ్గర సమాధానమే లేకుండాపోయింది. బంతిని క్రాలే డిఫెన్స్ చేసే లేపే.. ఆఫ్‌ స్టంప్స్‌ను గిరాటేసింది. దాంతో తొలి అంతర్జాతీయ వికెట్ దక్కిందన్న సంతోషంలో ఆకాష్‌ సంబరాల్లో మునిగిపోయాడు. అయితే అందరికీ షాక్ ఇస్తూ.. ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ రాడ్‌ టక్కర్‌ ‘నో బాల్‌’గా ప్రకటించాడు. దీంతో ఆకాష్‌ నిరాశకు గురయ్యాడు. బంతిని వేసే క్రమంలో ఆకాష్‌ ఫ్రంట్‌ లైన్‌ దాటేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: SRH Schedule 2024: ఫ్యాన్స్ గెట్ రెడీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే! ఉప్ప‌ల్‌లో ఎన్ని మ్యాచ్‌లంటే?

10వ ఓవర్లో ఆకాశ్‌ దీప్‌ తొలి వికెట్‌ సాధించాడు. 9.2 ఓవర్‌లో బెన్‌ డకెట్‌ (11) ఆడిన బంతి బ్యాట్ ఎడ్జ్‌ తీసుకుని.. వికెట్‌ కీపర్‌ ధృవ్ జురెల్ చేతికి చిక్కింది. ఆపై అదే ఓవర్లోని నాలుగో బంతికి ఒలీ పోప్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక 12వ ఓవర్ ఐదవ బంతికి దూకుడుగా ఆడుతున్న జాక్ క్రాలే (42)ను బోల్డ్ చేశాడు. 4వ ఓవర్‌లో బౌల్డయినా నోబాల్‌తో తప్పించుకున్న క్రాలే.. ఈసారి ఆకాశ్‌ ధాటికి నిలవలేదు. స్వల్ప వ్యవధిలో ఆకాశ్‌ మూడు వికెట్స్ పడగొట్టి టీమిండియాకు మంచి ఆరంభం ఇచ్చాడు.

Show comments